ఆంధ్రప్రదేశ్ పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమనరీ పరీక్ష ఇవాళ జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభమయ్యే పరీక్ష కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. అయితే, అభ్యర్థులను ఉదయం తొమ్మిది గంటల నుంచే పరీక్ష సెంటర్‌లోకి అనుమతివ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. ఉదయం 10 గంటల తర్వాత ఒక్కనిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించేది లేదని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఏపీ వ్యాప్తంగా 997 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు నియామక మండలి వెల్లడించింది.
పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమనరీ పరీక్ష కోసం బోర్డు పకడ్భందీ ఏర్పాట్లు చేసింది. ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు పరీక్షల నిర్వహణ బాధ్యతను అప్పగించింది. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతతోపాటు.. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎగ్జామ్ జరగనుంది. మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా.. 5,03,486 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 3,95,415 మంది పురుషులు, 1,08,071 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.
అభ్యర్థులు ముందుగానే తమ పరీక్షకేంద్రానికి చేరుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.