కొత్త పింఛన్ల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఫించన్లు అందించేందు సిద్ధమైంది. ఈమేరకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది. నేటి నుంచి వారం రోజుల పాటు గ్రామ వార్డు, సచివాలయాల్లో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను తీసుకోనుంది. మీ ఈ ఫించన్ ఎవరికి వస్తుంది. దీనికి అర్హులు ఎవరి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేయడానికి ఏం ఏం పత్రాలు కావాలో ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. నేటి నుంచి వారం రోజుల పాటు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వంలో జారీ చేసిన జీవో 174 ప్రకారమే లబ్ధిదారుల అర్హతను గుర్తించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారుల నుంచి వచ్చిన దరఖాస్తున్నలు పూర్తిగా పరిశీలించి అర్హులైన వారికి కేటగిరీల వారీగా ఫించన్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. ఈ దరఖాస్తు ప్రక్రియను నేటి నుంచి స్టార్ట్ చేసి 20 రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత అర్హులైన వారికి వచ్చే నెల ఒకటి నుంచి ఫించన్లు అందించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే NGSW వెబ్‌సైట్, ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు తమ దరఖాస్తు పత్రాన్ని సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శికి ఇవ్వాలి.. అతను మీ అప్లిక్లేసన్‌లో అన్‌లైన్‌లో ఎంట్రీ చేసి తర్వాత మీరు మళ్లీ ఓ రసీదు ఇస్తారు. తర్వాత మీ అప్లికేషన్లోని వివరాలను ఈకేవైసీ డేటాతో మ్యాచ్ అయితే మీ అప్లికేషన్ తర్వాత దశకు వెళ్తోంది. అలేదంటే మీ దరఖాస్తున్న ఉన్న సమస్యను తెలియజేసి సరైన డాక్యుమెంట్స్‌ను మళ్లీ సబ్‌మిట్ చేయాలని చెప్తారు.
మీరు ఫించన్‌ను అప్ల చేయాలంటే కావాల్సిన పత్రాలు
- ఆధార్, రేషన్ కార్డు, ఇన్‌కమ్ సర్టిఫికెట్
- వితంతు ఫించన్ కోసమైతే.. లబ్ధిదారు భర్త డెత్ సర్టిఫికెట్, భర్త ఆధార్ కార్డు ఉండాలి
- ఒంటరి మహిళ పింఛను కోసమైతే పెళ్లైన వారికి కోర్టు జారీ చేసి విడాకుల పత్రం ఉండాలి, పెళ్లికాని వారికి మ్యారేజ్ అవ్వనట్టు MRO జారీ చేసిన ధ్రువీకరణ పత్రం కావాలి.
- దివ్యాంగుల పింఛను కోసం అయితే.. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న సదరమ్ సర్టిఫికెట్ కావాలి.
- హిజ్రాల పింఛన్ కోసం జిల్లా మెడికల్ బోర్డు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం అవసరం
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
