AP Govt Employees: ఏపీ ఎన్జీవోల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7 తరువాత ఏ క్షణమైనా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు రేపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసులు అందించనున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. కాగా, వచ్చే నెల 7వ తేదీ వరకు ఉద్యమ కార్యాచరణను రూపొందించారు ఏపీఎన్జీవోలు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన ఈసీ మీటింగ్‌లో ఏపీఎన్జీవో సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఎన్జీవోల నిర్ణయం ప్రకారమే ముందుకు వెళతామని ఇతర ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. మరి ప్రభుత్వం దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.
Also read:
Dilraju: సుకుమార్ రైటింగ్ బ్యానర్లో ఆశిష్ సెల్ఫిష్ మూవీ.. దిల్ రాజు కామెంట్స్ వైరల్..
Chanakya Niti: ఈ 5 పరిస్థితులు ప్రతి వ్యక్తికి చాలా బాధను కలిగిస్తాయి.. అవేంటంటే..