పాడేరు, సెప్టెంబర్ 14: అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉదృతంగా ప్రవహిస్తున్నయి వాగులు, గెడ్డలు. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆరుగురు గ్రామానికి తిరిగి చేరుకోలేక అడవిలో చిక్కుకున్నారు. భోజనం లేక అల్లాడారు. మూగ జీవాలు కూడా తమతోనే ఉండిపోయాయి. ఎప్పుడూ అక్కడ నుంచి బయటపడతామా అనుకుంటూ ఆందోళన చెందసాగారు. అసలేం జరిగిందంటే.. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ కిల్లం కోట పంచాయతీ కప్పలు గ్రామానికి చెందిన ఆరుగురు పశువుల కాపరులు రోజూ గ్రామం నుంచి బయలుదేరి, కొండలు అడవుల పైకి తీసుకెళ్లి పశువులను మేపుతూ ఉంటారు. తిరిగి ఏ సాయంత్రానికైనా గ్రామానికి చేరుకుంటారు.
రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం పశువులు మేకలు తోడుకొని వెళ్లారు. కొండపైకి వెళ్లాలంటే.. కోడి మామిడి వద్ద గెడ్డ దాటాల్సిందే. గడ్డ దాటుకుంటూ మేత కోసం వెళ్ళిపోయారు. అంతవరకు బాగానే ఉంది. ఆరోజు మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఏజెన్సీ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉప్పొంగాయి. వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో భారీ వర్షానికి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు ఆ పశువుల కాపర్లు. అయితే కోడి మామిడి గడ్డ వరకు వచ్చేసరికి.. ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తోంది వరద నీరు. దీంతో ముందుకు కదల లేక గెడ్డకు అవతల వైపే వేచి చూసారు ఈ ఆరుగురు పశువుల కాపరులు.
గంగరాజు మాడుగుల మండలం కోడి మామిడి వాగు వద్ద చిక్కుకున్న పశువుల కాపరులు. వాగు దాటలేక మంగళవారం నుంచి అడవిలోనే అవస్థలు పడుతున్నారు. ఆకలితో అలమటించిన చెందిన పశువుల కాపరులు గ్రామస్తులు కనిపిస్తున్న గెడ్డలు దాటలేని పరిస్థితి. ఇవతల వైపు గ్రామస్తులు అవతల వైపు పశువుల కాపరులు. గడ్డ అవతల వైపు చిక్కుకున్న ఆరుగురు కుటుంబంలో ఆందోళన మొదలైంది. చీకటి పడింది.. గెడ్డ ఉధృతి తగ్గలేదు. దీంతో కొండపై అడవిలోనే కారు చీకటిలో ఉండిపోయారు. ఉదయానికి.. సమాచారం అందుకున్న జీ మాడుగుల పోలీసులు.. వారిని పర్యవేక్షించారు. ఆకలితో ఉన్న వారికి.. ఐదు కిలోమీటర్ల దూరంలోని లుచ్చాబు నుంచి ఆహార ఏర్పాట్లు చేశారు. గెడ్డ ఉధృతి తగ్గకపోవడంతో ఇంకా.. అక్కడే చిక్కుకున్నారు ఆరుగురు పశువుల కాపరులు. సాధ్యమైనంత త్వరగా వారిని సురక్షితంగా గ్రామానికి చేర్చే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే గెడ్డ ఉధృతి కాస్త తగ్గితేనే.. ప్రయత్నాలు ఫలిస్తాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.