AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సీఎం జగన్ కొత్త కేబినెట్‌లో పేర్లు ఖరారు.. పెద్దిరెడ్డి, బొత్సకు మళ్లీ ఛాన్స్!

ఏపీలో కేబినెట్‌ టెన్షన్‌ కంటిన్యూ అవుతోంది. బెర్త్‌ కోసం ఎమ్మెల్యేలు చివరి ప్రయత్నాల్లో ఉన్నారు. కాసేపట్లో రాజ్‌భవన్‌కు చేరనున్న లిస్టులో తమ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.

Andhra Pradesh: సీఎం జగన్ కొత్త కేబినెట్‌లో పేర్లు ఖరారు.. పెద్దిరెడ్డి, బొత్సకు మళ్లీ ఛాన్స్!
Cm Ys Jagan
Ram Naramaneni
|

Updated on: Apr 10, 2022 | 1:21 PM

Share

ఏపీలో కేబినెట్‌ టెన్షన్‌ కంటిన్యూ అవుతోంది. బెర్త్‌ కోసం ఎమ్మెల్యేలు చివరి ప్రయత్నాల్లో ఉన్నారు. కాసేపట్లో రాజ్‌భవన్‌కు చేరనున్న లిస్టులో తమ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. పాత మంత్రుల్లోనూ అదే టెన్షన్‌. పది మందిని కంటిన్యూ చేయడం కన్ఫ్మామ్‌ కావడంతో, ఆ పది మందిలో తామున్నామా? లేదా? అని మదనపడుతున్నారు. సర్వేపల్లి MLA కాకాణి గోవర్దన్‌రెడ్డి కొత్త కేబినెట్‌లో బెర్త్ ఖరారు అయినట్లే తెలుస్తోంది. కాకాణి ఇంటి దగ్గర సందడి కనిపిస్తోంది. కాకాణి ముఖం కూడా సంతోషంతో వెలిగిపోతోంది. పోలీసులు సైతం కాకాణి ఇంటికి క్యూ కడుతున్నారు. బొకేలతో అభినందిస్తూ స్వీట్లు తినిపిస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం..  ఇప్పటివరకు ఖరారైన మంత్రుల పేర్లు..

  1. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  2. బొత్స సత్యనారాయణ
  3. విడుదల రజిని
  4. ధర్మాన ప్రసాదరావు
  5. గుడివాడ అమర్‌నాథ్‌
  6. దాడిశెట్టి రాజా
  7. కాకాణి గోవర్థన్ రెడ్డి
  8. వేణుగోపాల్‌కృష్ణ
  9. జోగి రమేశ్
  10. గుమ్మనూరు జయరాం

ఇక, కేబినెట్‌లో బెర్త్‌ ఆశిస్తోన్న MLAలంతా సీఎంవో నుంచి ఫోన్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. తమకు కచ్చితంగా చోటు దక్కుతుందని భావిస్తున్న MLAలు ఫోన్లు పక్కనే పెట్టుకుని, వాటివైపే చూస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నివాసం దగ్గర భారీ రద్దీ కనిపిస్తోంది. ఆశావహులంతా సజ్జల ఇంటికి క్యూ కడుతున్నారు. కొత్త కేబినెట్‌లో చోటు కోసం సజ్జలను కలుస్తున్నారు. MLAల రాకతో మంగళగిరిలోని సజ్జల నివాసం సందడిగా మారింది.

ఏపీ కేబినెట్‌ రీషపుల్‌పై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. కేబినెట్‌ బెర్త్‌ కోసం MLAలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. మరికాసేపట్లో కొత్త మంత్రుల ఫైనల్‌ లిస్ట్‌ ప్రిపేర్‌ కానుంది. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కొత్త మంత్రుల జాబితా రాజ్‌భవన్‌కు చేరనుంది. దాంతో, ఆశావహులంతా లాస్ట్‌ ట్రయల్స్‌ చేసుకుంటున్నారు. రాజ్‌భవన్‌కు వెళ్లే కొత్త మంత్రుల లిస్ట్‌లో తమ పేరు ఉండేలా లాబీయింగ్‌ చేస్తున్నారు.

పాత మంత్రుల్లోనూ అదే టెన్షన్‌. పది మందిని కంటిన్యూ చేయడం కన్ఫ్మామ్‌ కావడంతో, ఆ పది మందిలో తామున్నామా? లేదా? అని మదనపడుతున్నారు.

Also Read: Watch Video: అతివేగం ఎంత ప్రమాదో చెప్పే రోడ్ యాక్సిడెంట్ ఇది.. క్షణ కాలంలో

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్