Watch Video: అతివేగం ఎంత ప్రమాదమో చెప్పే రోడ్ యాక్సిడెంట్ ఇది.. క్షణ కాలంలో
లైఫ్ చాలా విలువైనది. మరో జీవితం ఉందన్న గ్యారంటీ లేదు. అందుకే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. అతి వేగం మీతో పాటు ఎదుటివారికి కూడా ప్రమాదకరం.
Telangana: అతివేగం ఎంత ప్రమాదమో చెప్పే రోడ్ యాక్సిడెంట్ ఇది. వరంగల్( warangal)లోని శివనగర్‌లో చోటు చేసుకుంది. దిగువ వీడియోను జాగ్రత్తగా గమనించండి. ఓ కారు రయ్యిమంటూ దూసుకొస్తోంది. లెఫ్ట్ నుంచి మరోకారు నెమ్మదిగా మెయిన్‌రోడ్డు ఎక్కుతోంది. ఇంతలో స్ట్రెయిట్‌గా వెళ్తున్న కారు డ్రైవర్ కాస్త తడబడ్డాడు. ఇదే ప్రమాదానికి కారణమైంది. ఓవర్ స్పీడ్(Over Speed)తో డ్రైవ్ చేస్తుండడంతో స్టీరింగ్ కంట్రోల్ తప్పింది. లెఫ్ట్ నుంచి వస్తున్న కారును తప్పించే క్రమంలో పల్టీ కొట్టింది. ఎదురుగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్‌ను ఢీ కొట్టిన కారు అగిపోయింది. అందులోని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్పీడ్ కంట్రోల్ కాకపోవడం వల్లే కారు అదుపు తప్పిందని.. దగ్గర్లోనే డివైడర్, ట్రాఫిక్ సిగ్నల్ పోల్ ఉండడంతో ఢీ కొట్టి ఆగిపోయిందని పోలీసులు చెప్తున్నారు. లేకుంటే ప్రాణనష్టం తప్పకపోయేదని అంటున్నారు. కాబట్టి.. నెట్ టైమ్ కదా ట్రాఫిక్ ఉండదని మెరుపు వేగంతో దూసుకెళ్లకండి. నెమ్మదిగా వెళ్లండి. అతి వేగం ప్రమాదకరం.
Also Read: అత్యంత ప్రమాదకర రక్తపింజర పామును ఎలా పట్టుకున్నాడో చూడండి.!