Viral Video: నూతన వధూవరులకు విసన కర్రలు గిఫ్ట్.. ఎక్కడో తెలుసా అంటూ.. ఫన్నీ వీడియో నెట్టింట్లో వైరల్..

Viral Video: నూతన వధూవరులకు విసన కర్రలు గిఫ్ట్.. ఎక్కడో తెలుసా అంటూ.. ఫన్నీ వీడియో నెట్టింట్లో వైరల్..
Hand Fans Gift Viral Video

Viral Video: పెళ్లిళ్లలో వధూవరుల స్నేహితుల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పెళ్లికూతురు పెళ్ళికొడుకుని (Newly Wedding Couple) తమదైన శైలిలో ఆటపట్టిస్తూ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు..

Surya Kala

|

Apr 10, 2022 | 11:07 AM

Viral Video: పెళ్లిళ్లలో వధూవరుల స్నేహితుల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పెళ్లికూతురు పెళ్ళికొడుకుని (Newly Wedding Couple) తమదైన శైలిలో ఆటపట్టిస్తూ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఇక వారికి ఇచ్చే బహుమతులను కూడా డిఫరెంట్ గా ఇస్తూ.. పెళ్లిలో వచ్చిన ఆహుతులను కూడా అలరిస్తుంటారు. అయితే ఇలా వధూవరులకు స్నేహితులు ఇచ్చే బహుమతులు.. అప్పటి పరిస్థితులకు సమయానికి అనుకూలంగా ఎంచుకుని నవ్వులు పూయిస్తున్నారు.. ఉల్లి, పెట్రోల్ వంటి వస్తువులను కానుకలుగా ఇచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటి వరకూ ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తే.. తాజాగా ఓ వీడియోలో నూతన వధూవరులకు స్నేహితులు విసన కర్రలను కానుకగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

అసలే వేసవి కాలం.. ఉక్కబోత ఓ వైపు.. మరోవైపు విద్యుత్ కోతలు.. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నయి. ఇంకా చెప్పాలంటే.. కరెంట్ కోతల పుణ్యమా అని తాటాకు విసనకర్రలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం ప్రజలు విసన కర్రలను వెతుక్కుంటూ వెళ్లి మరీ కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఏపీలో తాటాకు విసన కర్రలకు భారీ డిమాండ్ నెలకొంది. వేలాపాలా లేని విద్యుత్ కోతల సమయంలో ఆ వదూవరులు ఇద్దరూ ఒకటైయ్యారు.. ఆ దంపతులకు దిమ్మదిగే బహుమతి ఇవ్వాలని స్నేహితులు నిర్ణయించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా, సోంపేట పట్టణంలో సాధారణంగా ఏదైనా పెళ్లి లో బంగారం, వెండి, బట్టలు ఏదో ఒక కానుకగా ఇస్తారు. సోంపేట పట్టణంలో జరిగిన సురేష్ వెడ్స్ నందిని వివాహకార్య క్రమంలో మిత్రులు విసనకర్రలు ఇచ్చి అక్కడున్న వారిని ఆశ్చర్య పరిచారు రాష్ట్రంలో పవర్ కట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సరదాగా ఈ గిఫ్ట్ ఇచ్చినట్లు మిత్రులు అన్నారు.స్నేహితులిచ్చిన గిప్ట్ ప్యాక్ ను ఓపెన్ చేసిన పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి అందులో రెండు విసన కర్రలు కనిపించాయి. వాటిని ఇద్దరూ తీసుకుంటే.. చుట్టుపక్కల ఉన్న ఆహుతులు విసురుకొండి ఒకరికొకరు అంటూ నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇప్పటికే కరెంట్ కోతలపై బంపర్‌ ఆఫర్‌.. ఆలసించిన ఆశాభంగం..రండి..మీ ఇంట్లో ఉన్న ఫ్యాన్‌ ఇస్తే విసనకర్ర ఇస్తాం..ట్యూబ్‌లైటు ఇచ్చి లాంతర్‌ తీసుకోండి..అంటూ రకరకాల మీమ్స్ తో సోషల్ మీడియోలో హోరెత్తుతున్న సంగతి తెలిసిందే.

Reporter : Satya , Tv9 Telugu

Also Read: Humanity: భారమైందంటూ వృద్ధురాలైన కన్నతల్లిని రోడ్డుమీద వదిలేసిన ఓ ప్రబుద్ధుడు..

Viral Video: మహిళకు సాయం చేసిన వ్యక్తి అనంతరం కిందపడిన వ్యక్తి నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu