Humanity: భారమైందంటూ వృద్ధురాలైన కన్నతల్లిని రోడ్డుమీద వదిలేసిన ఓ ప్రబుద్ధుడు..
Andhra Pradesh: మారుతున్న కాలంతో పాటు బంధాలుకూడా బలహీనపడుతున్నాయి. కొందరు పుత్రరత్నాలకి చివరికి కన్నతల్లిదండ్రులు కూడా భారమైపోతున్నారు. తమ ఆర్ధిక పరిస్థితి సహకరించడంలేదంటూ..
Humanity: మారుతున్న కాలంతో పాటు బంధాలుకూడా బలహీనపడుతున్నాయి. కొందరు పుత్రరత్నాలకి చివరికి కన్నతల్లిదండ్రులు కూడా భారమైపోతున్నారు. తమ ఆర్ధిక పరిస్థితి సహకరించడంలేదంటూ.. జీవాన్ని, జీవితాన్ని ఇచ్చిన అమ్మానాన్నలను అనాథల్లా రోడ్డుమీద వదిలేసి.. చేతులు దులిపేసుకుంటున్నారు. తాజాగా ఇటువంటి అవమానవీయ ఘటన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా(West Godavari)లో చోటు చేసుకుంది. నవమాసాలు కని పెంచిన తల్లిని అనాధల నడిరోడ్డు మీద వదిలేశాడు ఓ కొడుకు. ఓ పక్క వయోభారంతో నడవలేని పరిస్థితి మరో పక్క అనారోగ్యం రెండు రోజులుగా దిక్కుతోచని స్థితిలో ఆ తల్లి తల్లడిల్లింది. భీమడోలు(Bhimadole) జాతీయ రహదారి పక్కన బస్ షెల్టర్లో 3 రోజుల క్రితం సుమారు 80 సంవత్సరాల వయస్సు గల ఒక వృద్ధురాలిని చాప వేసి పడుకో బెట్టి వెళ్లిపోయారు. అయితే ఆ వృద్ధురాలు కదలలేని స్థితిలో ఆ చాప పైన పడుకుని నానా ఇబ్బందులు పడింది.. ఓ పక్క వయో భారం.. మరోపక్క అనారోగ్యంతో బాధ పడటం చూసి చుట్టుపక్కల పలువురు ఆమెకు ఆహారం నీరు అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వృద్ధురాలు వివరాలు సేకరించారు.
వృద్ధురాలు గుండుగోలను కు చెందిన అడపా నరసమ్మగా గుర్తించారు. వెంటనే ఆమె కుమారుని రప్పించి అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వృద్ధురాలికి ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు చనిపోగా మరో కుమారుడు నాగేశ్వరరావు వద్ద జీవిస్తుంది. అయితే నాగేశ్వరరావు అద్దె ఇంట్లో జీవిస్తు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. అప్పటికే నరసమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఇంటి యజమాని ఖాళీ చేయాలని నాగేశ్వరావుకు చెప్పడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తల్లిని అనాధల బస్ షెల్టర్లో వదిలి వెళ్లినట్లు చెబుతున్నాడు. ఆమెను ముందుగా అంబులెన్స్లో భీమడోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి, తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు సూచించారు.
Also Read: Viral Video: మహిళకు సాయం చేసిన వ్యక్తి అనంతరం కిందపడిన వ్యక్తి నెట్టింట వైరల్ అవుతున్న వీడియో