Narayana Arrest: పేపర్ లీకేజీ వ్యవహారంలో తగిన ఆధారాలతోనే నారాయణ అరెస్టు: మంత్రి అంబటి

|

May 10, 2022 | 3:20 PM

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ అయ్యారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో అనేక ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు టీడీపీ నేతలే సూత్రధారులని అన్నారు.

Narayana Arrest: పేపర్ లీకేజీ వ్యవహారంలో తగిన ఆధారాలతోనే నారాయణ అరెస్టు: మంత్రి అంబటి
AP Ex-Minister Narayana Arrest
Follow us on

10th Class Paper Leakage Episode: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ(Ex-Minister Narayana) అరెస్ట్ అయ్యారని మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) అన్నారు. రాష్ట్రంలో అనేక ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు టీడీపీ నేతలే సూత్రధారులని అన్నారు. పదో తరగతి పేపర్ లీకేజీలో నారాయణ కాలేజీ కీలకంగా ఉందని పేర్కొన్నారు. నారాయణ అరెస్టుని రాజకీయ కక్షసాధింపుగా చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. మరి పేపర్ లీక్ చేస్తే చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో తగిన సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి కాబట్టే నారాయణను పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెప్పుకొచ్చారు.

ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నారాయణ విద్యా సంస్థ నెంబర్ -1 సాధిస్తోందని మంత్రి అంబటి ఆరోపించారు. అరెస్టుపై ఏమైనా ఉంటే టీడీపీ వారు కోర్టులకు వెళ్లొచ్చుని సూచించారు. అంతే కానీ సీఎం జగన్ మీద పడి ఏడవకండని అంబటి వ్యాఖ్యానించారు.

పేపర్ లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను మంగళవారం ఉదయం కొండాపూర్‌లోని ఐకియా వద్ద ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. ఆయన సొంత వాహనంలోనే పోలీసులు చిత్తూరుకు తరలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Also Read..

Smartphone: స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి..

Nandamuri Family: నటుడిగా ఎదుగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి ఫ్యామిలీ హీరో ఎవరో గుర్తుపట్టారా?