జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తన ట్వీట్‌లో ‘పవిత్రమైన దీపారాధనతో సిగరెట్టు ముట్టించుకునే వాడని.. స్వర్గంలో ఉన్న తన తండ్రినే అవమానపరిచే పుత్రుడు సమాజానికి అవసరమా?’ అంటూ పవన్ కళ్యాణ్‌ను లక్ష్యం చేసుకుని రాసుకొచ్చారు.
ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా
నలుపు నలుపే గానీ తెలుపు రాదు ! ఇవి కూడా చదవండిగావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు
పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు !@naralokesh— Ambati Rambabu (@AmbatiRambabu) January 27, 2023
అయితే పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసిన మంత్రి అంబటి.. కొన్ని గంటల వ్యవధిలోనే లోకేశ్ పాదయాత్రను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఆయన ‘ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే గానీ తెలుపు రాదు! గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు!’ అంటూ లోకేష్ పాదయాత్ర ‘యువగళం’పై వ్యంగ్యాస్త్రాలను సంధించారు.
ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా
నలుపు నలుపే గానీ తెలుపు రాదు !గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు
పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు !@naralokesh— Ambati Rambabu (@AmbatiRambabu) January 27, 2023
చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్: నారాయణ స్వామి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించిన దారిలోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యమంటే ఏంటో తెలియని పవన్‌కల్యాణ్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని.. బూతులు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొడుతున్నారన్నారు నారాయణస్వామి. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌కళ్యాణ్ పనిచేస్తున్నారన్నారు.
14ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబును కాపుల కోసం ఏమి చేశారని పవన్ ఏనాడైనా అడిగారా..? అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తెచ్చింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తుచేశారు ఆయన. దాని గడువు ముగిసిన వెంటనే జగన్ మరో 20ఏళ్లు పొడిగించారని దీనిపై పవన్ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడంలేదని నారాయణస్వామి అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..