AP Home Minister Mekathoti Sucharita: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. అధికార వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలతో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కేంద్ర కార్యాలయం, పట్టాభి ఇంటిపై దాడికి దిగారు. ఈ దాడులకు నిరసనగా టీడీపీ బుధవారం (రేపు) రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. ఈ మేరకు సుచరిత మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు హద్దులు దాటి మాట్లాడుతున్నారంటూ పేర్కొన్నారు. పట్టాభి వ్యాఖ్యలు సభ్యసమాజం హర్షించదని సుచరిత పేర్కొన్నారు. జనం మెచ్చిన నాయకుడిపై పట్టాభి వ్యాఖ్యలను ప్రజలు సహించరని సుచరిత పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకున్న ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యమా అంటూ సుచరిత ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడితే ఎలాగంటూ ప్రశ్నించారు.
ఏపీకి డ్రగ్స్‌తో సంబంధం లేదని.. కేంద్రమే ఈ విషయాన్ని చెప్పిందని సుచరిత పేర్కొన్నారు. ఏపీ ఒడిశా సరిహద్దుల్లో గంజాయి పండుతోందని.. ఈ విషయం ఎప్పటినుంచో తెలిసిందేనని పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన ఘటనలకు చంద్రబాబే బాధ్యుడని.. ఆమె పేర్కొన్నారు. ఈ దాడులతో వాళ్లమీద వాళ్లే దాడి చేసుకున్నట్లుందని పేర్కొన్నారు. డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు అనేక చర్యలు చేపట్టామని తాము తీసుకున్న చర్యలపై రికార్డులతో సహా చెబుతామని సుచరిత పేర్కొన్నారు. సీఎం జగన్ నేరాలను అరికట్టేందుకు అనేక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. టీడీపీ వ్యవహారశైలీ పలు అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి సుచరిత హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదంటూ సుచరిత పేర్కన్నారు. డ్రగ్స్ విషయంలో టీడీపీ ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు.
Also Read: