Chandrababu: చంద్రబాబుకు భారీ ఊరట.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్
చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. మద్యం, ఇన్నర్ రింగ్‌రోడ్, ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభించింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.

చంద్రబాబుకు భారీ ఊరట దొరికింది. మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్‌రోడ్డు , ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో చంద్రబాబు 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే కేసు విచారణకు సహకరించాలని చంద్రబాబును హైకోర్టు ఆదేశించింది. కేసుకు సంబంధించిన అంశాలను బహిరంగ సమావేశాలు, మీడియా వేదికలపై ఎక్కడా ప్రస్తావించకూడదని పేర్కొంది. విచారణకు పిలవాల్సి వస్తే 48 గంటల ముందు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాలని సీఐడీకి కోర్టు సూచించింది.
ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై ఆంధ్రా క్రైమ్ ఇన్వెస్ట్‌మెంట్ డిపార్ట్‌మెంట్(CID) కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ బాబు తరఫున ఆయన లాయర్లు 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు నేడు ఉత్తర్వులు జారీ చేశారు. లిక్కర్ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ IAS శ్రీనరేశ్‌కూ ముందస్తు బెయిల్ మంజూరైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…