YSRCP: ఏపీ హైకోర్టులో వైసీపీకి ఊరట.. పార్టీ కార్యాలయాలపై కీలక ఆదేశాలు..

|

Jul 04, 2024 | 1:43 PM

వైసీపీ కార్యాలయాల కూల్చివేత విషయంలో తొందరపాటు వద్దని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. స్టేటస్‌కో కొనసాగిస్తూ కీల ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ఇచ్చే వివరణను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు భావించింది. అధికారులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సూచించింది. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగితే తప్ప.. ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. భవనాలకు అనుమతులకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ అన్నీ 2 వారాల్లో సమర్పించాలని వైసీపీ తరఫున పిటిషనర్లకు సూచించింది.

YSRCP: ఏపీ హైకోర్టులో వైసీపీకి ఊరట.. పార్టీ కార్యాలయాలపై కీలక ఆదేశాలు..
Ap High Court
Follow us on

వైసీపీ కార్యాలయాల కూల్చివేత విషయంలో తొందరపాటు వద్దని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. స్టేటస్‌కో కొనసాగిస్తూ కీల ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ఇచ్చే వివరణను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు భావించింది. అధికారులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సూచించింది. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగితే తప్ప.. ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. భవనాలకు అనుమతులకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ అన్నీ 2 వారాల్లో సమర్పించాలని వైసీపీ తరఫున పిటిషనర్లకు సూచించింది. సంబంధిత అన్నిశాఖల అధికారులు తప్పనిసరిగా హైకోర్టు నిబంధనలు ఫాలో అవ్వాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10కిపైగా వైసీపీ ఆఫీస్‌లకు నోటీసులు అందజేసింది ప్రభుత్వం. ఈ నేపధ్యంలో కోర్టును ఆశ్రయించారు వైసీపీ నేతలు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిబంధనల ప్రకారమే భూకేటాయింపులు జరిగాయని పిటిషనర్లు చెప్పారు. అనుమతుల విషయంలోనూ పొరపాట్లు లేవని వైసీపీ తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ తరుణంలో ప్రస్తుతం ఇచ్చిన స్టేటస్ కో ను కొనసాగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేశారు సీఆర్డీయే అధికారులు. అప్పట్లో కోర్టును ఆశ్రయించినప్పటకీ హైకోర్టు తీర్పు వచ్చే క్రమంలోనే పార్టీ ఆఫీసులను పడగొట్టారు. దీంతో పాటు విశాఖపట్నం, అనకాపల్లి ఇలా అనేక ప్రాంతాల్లోని వైసీపీ కార్యాలయాలకు నోటీసులు అందించారు అధికారులు. దీనిపై ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది వైసీపీ. పిటిషన్ పై స్పందించిన ఏపీ హైకోర్టు గతంలో రెండు రోజులు స్టేటస్ కో  ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువు నేటితో ముగియడంతో మరోసారి వాదనలు విన్న ఏపీ హైకోర్టు తదుపరి కోర్టు తీర్పు వెలువరించే వరకు వైసీపీ కార్యాలయాలను పడగొట్టకూడదని స్టేటస్ కో అమలు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ పార్టీ నాయకులకు స్వల్ప ఊరట లభించినట్లయింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…