బాబోయ్ ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో ఉన్నా.. ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు జనాలు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు ఆగం ఆగం అవుతున్నారు. ఫ్యాన్స్, కూలర్స్, ఏసీ లు పెట్టుకున్నా తట్టులేని పరిస్థితి నెలకొంది. పొరపాటున పని మీద బయటకు వస్తే మాడు పగిలిపోతుంది. ఈ ఎండలు ఇలా ఉంటే.. వాతావరణ కేంద్రం ప్రకటన మరింత భయపెట్టిస్తున్నాయి. వడగాడ్పుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ), విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.
ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 125 మండలాల్లో వడగాల్పులు వీచే ఛాన్స్ ఉంది. ఇక శుక్రవారం 40 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. విపత్తుల సంస్థ నుంచి వడగాల్పుల హెచ్చరిక మెసెజ్ అందినప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. గురువారం మన్యం జిల్లా కొమరాడ, పార్వతీపురం కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందన్నారు.
శ్రీకాకుళం: 13
విశాఖపట్నం: 2
అల్లూరి జిల్లా: 7
అనకాపల్లి:15
ఏలూరు: 2
తూర్పు గోదావరి: 4
కాకినాడ: 10
గుంటూరు: 11
ఎన్టీఆర్: 12
కృష్ణా: 4
మన్యం: 11
పల్నాడు: 5
విజయనగరం: 23
వైఎస్సార్ జిల్లా: 6,
ఈ మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుంది. ఇక, బుధవారం నాడు అనకాపల్లి జిల్లాలో 8 మండలాలు, విజయనగరం జిల్లాలోని ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచాయని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..