MBBS Students: ‘ప్రాక్టికల్స్‌లో ఫెయిలవుతున్న 50 శాతం మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు.. అరకొర చదువులతో ఒరిగేదేముంది?’

|

Apr 19, 2023 | 3:16 PM

యూనివర్సిటీల్లో నిర్వహించే ప్రాక్టికల్స్‌లో 50 శాతం మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఫెయిల్‌ అవుతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. పీజీ వైద్య విద్యలో సీటు సాధించాలన్న ఉద్దేశంతో ఎంబీబీఎస్‌ విద్యార్థులు ప్రాక్టికల్స్‌పై శ్రద్ధ పెట్టడం..

MBBS Students: ప్రాక్టికల్స్‌లో ఫెయిలవుతున్న 50 శాతం మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు.. అరకొర చదువులతో ఒరిగేదేముంది?
Chief Secretary Krishnababu
Follow us on

యూనివర్సిటీల్లో నిర్వహించే ప్రాక్టికల్స్‌లో 50 శాతం మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఫెయిల్‌ అవుతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. పీజీ వైద్య విద్యలో సీటు సాధించాలన్న ఉద్దేశంతో ఎంబీబీఎస్‌ విద్యార్థులు ప్రాక్టికల్స్‌పై శ్రద్ధ పెట్టడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యలో సీటు సాధించే సన్నద్ధతకు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో.. ఎంబీబీఎస్‌ చదువుకూ అంతే ప్రాధాన్యమివ్వాలని ఆయన విద్యార్ధులకు సూచించారు. వైద్య విద్యలో అరకొర చదువుల వల్ల ప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. ఎకో ఇండియా-వైద్య సిబ్బందికి విధుల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విజయవాడలో ఏర్పాటు చేసిన 2 రోజుల అవగాహన సదస్సును మంగళవాకం (ఏప్రిల్ 18) కృష్ణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

వార్డు బాయ్‌ నుంచి వైద్యాధికారి వరకు ఎకో ఇండియా ద్వారా పునశ్చరణ తరగతులు జరుగుతాయని ఆయన తెలిపారు. అత్యవసర కేసులకు ఆసుపత్రుల్లో చికిత్స అందించే వ్యవస్థ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని నాలుగు కొత్త ప్రభుత్వ వైద్య కాలేజీలను (రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలల్లో) ఏర్పాటు చేస్తున్నామని, వాటిల్లో 2023-24 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అందుకవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను జూన్‌ నాటికి పూర్తి చేస్తామని తెల్పుతూ జాతీయ వైద్య కమిషన్‌కు ‘అండర్‌ టేకింగ్‌’ లేఖను అందజేశామన్నారు. ఇందులో భాగంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) తనిఖీలు చేస్తున్నట్లు కృష్ణబాబు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.