ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 285 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల సంబంధించి నియామక ప్రక్రియ పూర్తి చేసింది. మార్చి 21న వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీలో జరిగిన కౌన్సెలింగ్‌లో 218 మందికి నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్రంలో మొత్తం 134 పోస్టులతో పాటు కొత్తగా ఏర్పడిన పీహెచ్‌సీల్లో 88, మారుమూల ప్రాంతాల్లో ఉన్న 63 వైద్యుల పోస్టులకు కలిపి ఉమ్మడిగా కౌన్సెలింగ్ నిర్వహించారు.
అపాయింట్ డాక్యుమెంట్లు (నియామక పత్రాలు) అందుకున్న వారంతా వారం వ్యవధిలో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుందని డైరెక్టర్ ఫర్ హెల్త్ రామిరెడ్డి సూచించారు. వైద్య విభాగంలోని డిప్యూటీ డైరెక్టర్లు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొని నియామక ప్రక్రియ చేపట్టారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.