AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: 5 రోజులైనా అందని పెన్షన్ డబ్బులు.. అసలేం జరిగిందని ఆరాతీయగా.. మామూలు కథ కాదుగా..

నెలకోసారి వచ్చే ప్రభుత్వ పెన్షన్ డబ్బుల కోసం ఓ గ్రామంలోని వృద్దులు, దివ్యాంగులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు పంచుతారో అంటూ సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు.. ఒకటో తేదీ దాటింది.. అయినా ప్రభుత్వ పెన్షన్ రాలేదు.. దీంతో మరునాడే వస్తుందిలే అనుకుంటూ వేయి కళ్ళతో ఎదురుచూసినా నిరాశే ఎదురైంది.. అలా ఐదురోజులు గడిచిపోయాయి..

Andhra News: 5 రోజులైనా అందని పెన్షన్ డబ్బులు.. అసలేం జరిగిందని ఆరాతీయగా.. మామూలు కథ కాదుగా..
Ap Pension
Maqdood Husain Khaja
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Apr 05, 2025 | 2:50 PM

Share

నెలకోసారి వచ్చే ప్రభుత్వ పెన్షన్ డబ్బుల కోసం ఓ గ్రామంలోని వృద్దులు, దివ్యాంగులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు పంచుతారో అంటూ సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు.. ఒకటో తేదీ దాటింది.. అయినా ప్రభుత్వ పెన్షన్ రాలేదు.. దీంతో మరునాడే వస్తుందిలే అనుకుంటూ వేయి కళ్ళతో ఎదురుచూసినా నిరాశే ఎదురైంది.. అలా ఐదురోజులు గడిచిపోయాయి.. నెలనెలా ఒకటో తేదీ నాటికే అందరికీ పెన్షన్ అందేది.. కానీ.. రోజులు గడుస్తున్నా అందకపోయేసరికి.. ఆందోళనలో పడ్డారు. ఏం జరిగి ఉంటుందా అని అరా తీస్తే.. అసలు విషయం తెలుసుకొని అందరూ ముక్కున వేలేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం తాజంగి గ్రామ సచివాలయం-2 పరిధిలో చెరువు వీధి గ్రామం. అక్కడ చాలామంది వృద్ధులు, దివ్యాంగ గిరిజనులు నివసిస్తున్నారు. వారందరికీ ప్రతినెలా పెన్షన్ ఒకటో తేదీ నాటికి అందేది. ఇంటికి వచ్చి మరి పెన్షన్ అందించేవారు. కానీ ఈసారి సకాలంలో పెన్షన్ చేతికి అందలేదు. ఒకరోజు ఆలస్యమైనా మరుసటి రోజు వచ్చేస్తుందని అనుకున్నారు అంతా. కానీ రోజులు గడుస్తున్నాయి.. ఐదో తేదీ వరకు పెన్షన్ చేతికి అందలేదు. దీంతో ఆ పెన్షన్ పైనే ఆధారపడ్డ చాలా మంది పేదలు, వృద్ధులు ఇప్పుడు అర్ధాకలితో అలమటించే పరిస్థితి ఏర్పడింది.

అసలు విషయం ఏంటంటే.. తాజంగి గ్రామ సచివాలయం 2 లో పనిచేస్తున్న గ్రామ సర్వేయర్ సాగిన రవికుమార్.. ప్రతినెలా తన పరిధిలో ఉన్న 54 మంది లబ్ధిదారులకు సంబంధించిన పెన్షన్ నగదును వెల్ఫేర్ అసిస్టెంట్ నుంచి తీసుకుంటూ ఉంటాడు. అలాగే ఈ నెలకు సంబంధించిన పెన్షన్స్ 2.47 లక్షలు మార్చి 29న వెల్ఫేర్ అసిస్టెంట్ ఫామిలీ చిలకమ్మ అందజేసింది. అయితే ఏప్రిల్ ఒకటో తేదీన 14 మంది లబ్ధిదారులకు మాత్రమే 58,000 పెన్షన్ పంపిణీ చేశాడు సర్వేయర్ రవికుమార్. మరో నలబై మంది వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్ పంపిణీ చేయకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో లబ్ధిదారులు పంచాయతీ కార్యాలయానికి ఈనెల రెండో తేదీన వెళ్లారు. అధికారులు అప్రమత్తమయ్యారు. మూడో తేదీ వరకు సర్వేయర్ రవికుమార్ జాడ తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు అధికారులు..

ఈ విషయం తెలుసుకున్న సర్వేయర్ రవికుమార్.. రెండు విడతల్లో నగదు చెల్లిస్తానని అంగీకరానికి వచ్చాడు. ఫిర్యాదు చేసిన వెల్ఫేర్ అసిస్టెంట్ చిలకమ్మకు నగదు తిరిగి చెల్లించేందుకు పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో లక్ష రూపాయలు అందించాడు. మిగతా సొమ్ము కూడా త్వరలోనే అందిస్తానని పోలీసుల ముందు చెప్పాడు..

అసలు విషయం ఇదేనా..!

పెన్షన్ సొమ్మును చెల్లించాలని గత నెల 29 అని వెల్ఫేర్ ఆఫీసర్ సర్వేయర్ కు 2.46 లక్షల నగదును అందజేశారు. ఆ తర్వాత అందులో 58 వేల పెన్షన్ మాత్రమే పంపిణీ చేశాడు సర్వేయర్ రవికుమార్. మిగతా సొమ్ము ఏమైంది అని స్థానికంగా ఆరాతీస్తే.. అదే రోజు గ్రామ దేవత జాతర జరిగింది. అక్కడ జూదమాడుతూ కొంతమందికి కనిపించాడు రవికుమార్.. అందులోనే మిగిలిన పెన్షన్ సొమ్ము అంతా కోల్పోయి ఉంటాడని చర్చ ఇప్పుడూ జోరుగా సాగుతోంది. ఆ తర్వాత చేతిలో నగదు లేక రెండు రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు రవికుమార్. అయితే తాను పెన్షన్ సొమ్మును సొంతానికి వినియోగించుకున్నానని అంగీకరించాడు సర్వేయర్ రవికుమార్.

ఆ సొమ్మంతా రెండు విడుతలలోనే తిరిగి అధికారులకు ఇచ్చేసాను అని చెబుతున్నాడు. అయితే పెన్షన్ సొమ్ము సొంతానికి వినియోగించుకుని సకాలంలో లబ్ధిదారులకు ఇవ్వని కారణంగా అధికారులు ఆగ్రహంతో ఉన్నారు. శాఖా పరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సర్వేయర్ రవికుమార్ కు షోకాజ్ నోటీసులు సైతం జారీ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..