అమ్మ బాబోయ్.. శ్రీశైల మహాక్షేత్రంలో రెండు చిరుత పులుల కలకలం..!
శ్రీశైల మహాక్షేత్రాన్ని చిరుతపులులు వదలడం లేదు. ఈసారి రెండు చిరుతలు రావడం కలకలం రేపుతోంది. చిరుతపులుల కదలికలకు సంబంధించి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. శ్రీశైలం ఏపీ జెన్‌కో కాలనీలోకి రెండు చిరుతపులులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట ఏపీ జెన్‌కో కాలనీలో తెల్లవారుజామున రెండు చిరుతపులుల సంచారం కలకలం రేపింది. చిరుతపులుల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సీసీ కెమెరాలు రికార్డు అయిన దృశ్యాలను చూసి జన్‌కో ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని చిరుతపులుల జాడలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కాలనీవాసులకు అటవీ శాఖ అధికారులు సూచనలు చేశారు.
గతంలో కూడా పలుమార్లు సున్నిపెంట కాలనీలో చిరుతపులుల సంచారం కనిపించింది. గతంలో రెండు నెలల క్రితం జెన్‌కో కాలనీ సమీపంలోనే ఓ ఇంట్లోకి చిరుత పులి ప్రవేశించి, పెంపుడు కుక్కను సైతం చంపేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. రెండున్నర నెలల తర్వాత మరోసారి రెండు చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. నల్లమలకు సున్నిపెంట సమీపం గ్రామం కావడంతో తరచూ ఊరిలోకి చిరుతపులులు సంచారం పరిపాటిగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు తెలిపారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..