AP CM YS Jagan: ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం.. కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు రూ. 10లక్షల ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ మృతుల కుటుంబాలకు ఊరటనిచ్చేలా కొత్త పథకాన్ని ప్రకటించారు.
AP CM YS Jagan financial assist: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వందలాది కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి అనాథలుగా మారుతున్నాయి. తల్లిదండ్రులను మరణంతో రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ మృతుల కుటుంబాలకు ఊరటనిచ్చేలా కొత్త పథకాన్ని ప్రకటించారు.
కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల పేరిట రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. వీటిపై నెలనెల వచ్చే వడ్డీతో ఆ పిల్లల కనీస అవసరాలు తీర్చేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అలాగే, ఆ పిల్లలకు 25 ఏళ్లు నిండిన తర్వాత ఈ డిపాజిట్ మొత్తం విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఆర్థిక సాయానికి సంబంధించిన ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.