Black Fungus: ఏపీలో కలవరపెడుతున్న బ్లాక్ ఫంగస్.. వెలుగుచూసిన మరో కేసు.. అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్

పశ్చిమగోదావరి జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపింది. కాళ్ల మండలం ఎల్‌ఎన్‌పురానికి చెందిన సూర్యనారాయణకు సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

Black Fungus: ఏపీలో కలవరపెడుతున్న బ్లాక్ ఫంగస్.. వెలుగుచూసిన మరో కేసు.. అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్
Black Fungus Case
Follow us

|

Updated on: May 17, 2021 | 8:25 PM

Black Fungus Case Found in AP: పశ్చిమగోదావరి జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపింది. కాళ్ల మండలం ఎల్‌ఎన్‌పురానికి చెందిన సూర్యనారాయణకు సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆటో డ్రైవర్ అయిన సూర్యనారాయణ ఇటీవల కరనా బారినపడి చికిత్స పొందుతున్నారు. రోజులు గడుస్తున్నా కొద్ది వైరస్ తీవ్రత తగ్గపోవడంతో.. విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆయనకు బ్లాక్ ఫంగస్ సోకినట్లు నిర్ధారించారు. అయితే, కరోనా బారినపడ్డ అతన్ని స్థానిక వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో సొంతంగానే సత్యనారాయణ ఇంట్లో చికిత్స పొందుతున్నాడు.

రాష్ట్రంలో మరో బ్లాక్ ఫంగస్ వైరస్ కేసు బైటపడటంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. కాళ్ల మండలం ఎల్‌ఎన్‌పురం గ్రామంలో వెలుగు చూసిన బ్లాక్ ఫంగస్ వైరస్‌పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలో బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ సునందను అదేశించారు.

సూర్యనారాయణకు బ్లాక్ ఫంగస్ సోకినా వైద్య సిబ్బంది పట్టించుకోలేదని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కథనంపై స్పందించిన మంత్రి వైద్య బృందాన్ని సూర్యనారాయణ ఇంటికి పంపించి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. దీంతో జిల్లా యంత్రాంగం కదిలింది. ఎల్‌ఎన్‌పురం గ్రామంలో బాధితుడు సూర్యనారాయణ ఇంటికి హుటాహుటిన చేరుకుని వివరాలు సేకరించారు కాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది.

తానుకొండ సూర్యనారాయణ కరోనా నిర్ధారణ కావడంతో విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. గత రెండు రోజులగా ఎడమ దవడ ప్రాంతంలో విపరీతంగా నొప్పులు రావడంతో మణిపాల్ హాస్పిటల్ లో వైద్యులను సంప్రదించారు. మణిపాల్ హాస్పిటల్‌లో పరీక్షలు చేసి సూర్యనారాయణకు బ్లాక్ ఫంగస్ అని నిర్ధారించారు వైద్యులు. దీంతో ఐదు రోజులకు సరిపడా మందులు ఇచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూర్యనారాయణకు సూచించారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్న సూర్యనారాయణ వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారు. బ్లాక్ ఫంగస్ సోకిన ఆయనకు జిల్లా వైద్యాధికారులు ప్రత్యేకమైన మెడికల్ కిట్స్ అందించారు.

రాష్ట్రంలో కరోనాతో పాటు బ్లాక్‌ ఫంగస్‌ కేసుల సంఖ్య కూడా నెమ్మదిగా పెరుగుతున్నాయి. కొవిడ్‌ బాధితుల్లో ఎక్కువగా బ్లాక్‌ ఫంగస్‌ బయటపడుతోంది. ఎక్కువగా ఐసీయూలో ఉండడం, ఆక్సిజన్‌, స్టెరాయిడ్స్‌ వాడే వారిలో బ్లాక్‌ ఫంగస్‌ బయటపడుతోందని వైద్యులు చెబుతున్నారు. తొలుత శ్రీకాకుళం జిల్లాలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. తర్వాత గుంటూరులో 4, తూర్పుగోదావరి 3, ప్రకాశం 1, కర్నూలులో 2 కేసులు నమోదయ్యాయి. విశాఖ, పశ్చిమగోదావరిలోనూ లక్షణాలున్నవారిని గుర్తిచారు.

ఇదిలావుంటే, బ్లాక్ ఫంగస్ సోకినవారు అధైర్యపడాల్సిన అవసరం లేదని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చామని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించామని, ఇంకా ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుంటే ప్రభుత్వానికి వివరాలు అందించాలన్నారు. ఇందుకు అవసరమైనం మందులు అందుబాటులో ఉంచుతున్నామన్నారు.

Read Also…Viral Video : సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన దివ్యాంగుడు.. చేతులు లేకుండానే యువకుడు చేస్తున్న కృషికి ఫిదా అవుతున్న నెటిజన్లు ఫిదా ..(వీడియో).