Aadhaar Special Camps: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపట్నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ స్పెషల్‌ క్యాంపులు..!

|

Aug 21, 2023 | 6:59 AM

ఆధార్‌లో దొర్లిన తప్పుల కారణంగా అర్హులెవరూ ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో స్పెషల్ ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది. ఆగస్టు 22 నుంచి అంటే రేపట్నుంచే క్యాంప్‌లు ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 22, 23, 24, 25 తేదీల్లో మొత్తం నాలుగు రోజుల పాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది. ఈ మేరకు తెలియజేస్తూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ లక్ష్మీశ అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల..

Aadhaar Special Camps: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపట్నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ స్పెషల్‌ క్యాంపులు..!
Aadhaar Updates
Follow us on

అమరావతి, ఆగస్టు 21: రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరనే విషయం అందరికీ తెలిసిందే. ఆధార్‌ లేనిదే స్కూల్‌ అడ్మిషన్లు నుంచి పించన్‌ వరకు ఎక్కడా ఏ పని జరగదన్నది జగమెరిగిన సత్యం. ఐతే ఆధార్‌ కార్డుల్లో దొర్లిన తప్పుల వల్ల కొందరు లబ్ధి దారులు ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా, ప్రభుత్వ ప్రయోజనాలకు దూరంగా ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆధార్‌లో దొర్లిన తప్పుల కారణంగా అర్హులెవరూ ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో స్పెషల్ ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది. ఆగస్టు 22 నుంచి అంటే రేపట్నుంచే క్యాంప్‌లు ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 22, 23, 24, 25 తేదీల్లో మొత్తం నాలుగు రోజుల పాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది. ఈ మేరకు తెలియజేస్తూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ లక్ష్మీశ అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇన్‌చార్జిలకు ఆదేశాలు జారీ చేశారు.

ఆధార్ తీసుకున్న పదేళ్ల వ్యవధిలో కనీసం ఒక్కసారైనా తమ ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని యూఐడీఏఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో గత పదేళ్లుగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోనివారు తమ ఆధార్‌ కార్డును ఈ నాలుగు రోజుల్లో తమ దగ్గర్లోని సచివాలయం క్యాంపులో అప్‌డేట్‌ చేసుకోవల్సిందిగా సూచించింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.56 కోట్ల మందికి ఇప్పటి వరకూ ఆధార్‌ కార్డులు ఉన్నాయి. వీరిలో సుమారు 1.49 కోట్ల మంది గత పదేళ్లలో ఒక్కసారి కూడా తమ వివరాలను అప్‌డేట్‌ చేసుకోలేదని ప్రభుత్వం తెలిపింది. వీరంతా ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవల్సిందిగా సూచించారు. అలాగే కొత్తగా ఆధార్‌ కార్డు తీసుకునే వారు కూడా క్యాంపుల్లో పొందుకోవచ్చని వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.