శేషాచలం, సెప్టెంబర్ 5: అమ్మకానికి ఎర్ర బంగారం సిద్ధమైంది. ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనంకు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్ ను ఉపయోగించుకుని కోట్ల రూపాయలు ఆర్జించటం కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా గ్లోబల్ టెండర్ల ద్వారా గోడౌన్లలో ఉన్న ఎర్రచందనాన్ని వేలం వేయడానికి అధికారులు కసరతులు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో ఉన్న శేషాచలం అడవులలోని కొండల్లో మాత్రమే యర్రచందనం దొరుకుతుంది. దీన్ని యర్ర బంగారంగా పిలుస్తుంటారు కొందరు. ఈ అడవులు కొండ ప్రాంతంలో దాదాపు 5.5 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి.
ప్రపంచంలో మరెక్కడా దొరకని ఎర్రచందనం ఈ అడవుల్లో మాత్రమే నిక్షిప్తమై ఉంది. ఈ ఎర్రచందనం చెట్లు ప్రపంచంలోనే చాలా అరుదైన జాతికి చెందినవని, ప్రధానంగా, శేషాచలం కొండల్లోని అడవులలో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ చేవ ఉండడంతో దానికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. చైనా, జపాన్, రష్యాలలో ఎర్ర చందననాన్ని వివిధ రూపాల్లో వినియోగిస్తుంటారు. విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి స్మగ్లర్లు అనేక మార్గాల్లో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. డిమాండ్ కు తగ్గ స్థాయిలోనే ఎర్రచందనం అక్రమ రవాణా కూడా సాగుతుంది. సినిమాలలో చూసిన మాదిరిగా ఎర్రచందన్నానని ఊహించని విధంగా తరలిస్తూనే ఉన్నారు . ఇలా పట్టుబడిన ఎర్రచందనాన్ని గూడౌన్ లలో దాచి వేలం వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది.
రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పట్టుబడ్డ ఎర్రచందనం అమ్మడం ద్వారా వందల కోట్ల రూపాయలు ఆర్జించేందుకు సిద్ధపడింది . ఇందులో భాగంగా 16వ సారి గ్లోబల్ టెండర్ల ద్వారా ఎర్రచందనం వేలం వేయడానికి రంగం సిద్ధం చేసింది. సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి 8వ తేదీ వరకు 615 మెట్రిక్ టన్నులను వేలం వేసి 200 కోట్ల రూపాయల పైచిలుకు ఆదాయం పొందడమే లక్ష్యంగా గ్లోబల్ టెండర్లు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎఫ్డిసి చైర్మన్ డికె సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో రాజంపేట, పీలేరు, భాకరాపేట, తిరుపతి ప్రాంతాల్లో ఎర్రచందనం గోడౌన్లు ఉన్నాయి వీటిలో భద్రపరిచిన 65.833 మెట్రిక్ టన్నులను అమ్మకానికి సిద్ధంగా ఉంచింది. ఇలా అరుదైన ఎర్రచందనం ప్రభుత్వ ఆదాయ వనరుగా మారింది .
ఎర్రచందనానికి సంబంధించి శేషాచలంలో చాలా మటుకు ప్రాంతంలో అనేక వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఈ అటవీ ప్రాంతంలోని ఎర్రచందనాన్ని గనక సక్రమంగా స్మగ్లర్ల చేతికి కాకుండా ప్రభుత్వమే అమ్మగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి ప్రతి ఏటా వస్తుంది. ఇది అంతరించిపోయే పంట కాకపోవడంతో అడవిని నరికే కొద్దీ ఎర్రచందనం పుట్టుకొస్తూనే ఉంటుంది అందుకే ఎర్రచందనంపై స్మగ్లర్లు కన్నేసి కోట్లు ఆర్ధిస్తున్నారు. స్మగ్లర్లను పట్టుకున్న వారిపై పిడి యాక్టులు ఓపెన్ చేసిన ఎర్రచందనం స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు ప్రభుత్వంకి పట్టుబడ్డ ఎర్రచందనం స్మగ్లర్లు తరలించుకుపోతున్న దాంట్లో పోలిస్తే ఐదు శాతం కూడా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎర్రచందనంపై దృష్టి సారిస్తే పెద్ద ఆదాయ వనరుగా మారడానికి ఏమాత్రం తీసిపోదు ఇసుక ఆప్కారి శాఖ తో పాటు ఎర్రచందనం కూడా ఒక ఆదాయ వనరుగా మారుతుంది
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.