సమస్యల పరిష్కారం కోసం గత కొంతకాలంగా ఉద్యమ బాటపట్టిన ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది ప్రభుత్వం. రేపు (గురువారం) ఉదయం ఏపీ జేఏసీ అమరావతి నేతలతో సీఎస్ జవహర్ రెడ్డి చర్చలు జరుపుతారు. ఏపీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం దశలవారీ ఉద్యమాన్ని కొనసాగిస్తోంది ఏపీ జేఏసీ అమరావతి. అందులో భాగంగానే ఏపి జెఏసి రాష్ట్రకమిటీ తరఫున ఫిభ్రవరి 13 న చీఫ్ సెక్రటరీకి 50 పేజీల మెమోరాండం సమర్పించింది. అవే అంశాలపై ఉద్యోగ జేఏసీ నేతలతో గురువారం సీఎస్ చర్చించనున్నారు.మరోవైపు గత 84 రోజులుగా సాగుతోన్న ఉద్యమం మూడో దశకు చేరుకుంది. తమ పోరాటం కొనసాగింపులో భాగంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని భావిస్తోంది ఏపీ జేఏసీ అమరావతి. మరోవైపు గుంటూరులో జూన్ 8న ఏపీ జేఏసీ అమరావతి ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. సదస్సుకు సంబందించిన పోస్టర్లను బొప్పరాజు ఆవిష్కరించారు.
ఇక తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీజేఏసీ ఆధ్వర్యంలో 84 రోజులుగా ఉద్యమిస్తున్నామని బొప్పరాజు వెల్లడించారు. తమ ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వం కొన్ని జీవోలు ఇచ్చిందని బొప్పరాజు వెల్లడించారు. అయినప్పటికీ ఇంకా కొన్ని ప్రధాన డిమాండ్లు మాత్రం పరిష్కారం కాలేదని బొప్పరాజు వెల్లడించారు. జూన్ 10లోపు తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం తీవ్రం చేస్తామని బొప్పరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..