Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. గ్రామ సచివాలయాల్లో పాస్‌పోర్టు సహా మరెన్నో సేవలు..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఏపీ ప్రభుత్వం నెలకొల్పిన గ్రామ సచివాలయాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై గ్రామ సచివాలయాల్లోనే పాస్‌ పోర్టుతో..

Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. గ్రామ సచివాలయాల్లో పాస్‌పోర్టు సహా మరెన్నో సేవలు..
Follow us

|

Updated on: May 02, 2022 | 12:12 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఏపీ ప్రభుత్వం నెలకొల్పిన గ్రామ సచివాలయాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై గ్రామ సచివాలయాల్లోనే పాస్‌ పోర్టుతో పాటు పాన్‌ కార్డు, రైల్వే టికెట్‌ బుకింగ్‌తో పాటు మరికొన్ని ప్రభుత్వ సేవలు కూడా పొందే అవకాశం కల్పించారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ సేవలు కూడా వీటిలో పొందవచ్చు. ఎల్‌ఐసీ ప్రీమియం కూడా ఇక్కడే చెల్లించవచ్చు. ఇప్పటి వరకు 545 రకాల రాష్ట్ర ప్రభుత్వ సేవలు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి వీటికి మరికొన్ని జోడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1600 సచివాలయాల్లో ఈ సేవలను ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే 98 మంది పాస్‌ పోర్ట్ సేవలను వినయోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని సచివాలయాల్లోనూ అదనపు సర్వీసులను గ్రామ, వార్డు సచివాలయ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే జూన్‌ నుంచి ప్రజల కోసం మరో 2,500 సచివాలయాలలో ఆధార్‌ సర్వీసులు అందించనున్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా అన్ని పాఠశాలల్లో ఆధార్‌ క్యాంపులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తలకోసం క్లిక్ చేయండి..

Also Read: India Covid-19: దేశంలో మళ్లీ మొదలైన కరోనా కలవరం.. వారంలో 41% పెరుగుదల.. కొత్తగా ఎన్నంటే?

Petrol Diesel Price: వాహనదారులకు కాస్త ఉపశమనం.. ఈరోజు కూడా స్థిరంగానే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

Humanity Video: నడిరోడ్డుపై హఠాత్తుగా పడిపోయిన వ్యక్తి.. పరుగెత్తుకొచ్చిన జనం.. చివరికి..