AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారి అకౌంట్లోకి ఒకేసారి రూ.30 వేలు.. ముహూర్తం ఫిక్స్..

ఏపీలో స్థానిక సంస్ధల ఎన్నికల షెడ్యూల్ బుధవారం విడుదలైంది. 13 మున్సిపల్‌ కార్పొరేషన్లతో పాటు 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఎన్నికలు జరిపేందుకు షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుకంది. వారికి గౌరవ వేతనాలు చెల్లించనుంది.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారి అకౌంట్లోకి ఒకేసారి రూ.30 వేలు.. ముహూర్తం ఫిక్స్..
Ap Government
Venkatrao Lella
|

Updated on: Oct 15, 2026 | 7:46 AM

Share

ఇమామ్, మౌజమ్‌లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. మూడు నెలలకు సంబంధించి గౌరవ వేతనాలను ఒకేసారి అకౌంట్లలో జమ చేయనుంది. దీంతో వారి అకౌంట్లలో ఒకేసారి రూ.30 వేలు జమ కానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.22.50 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ వరకు చెల్లించాల్సిన జీతాలను ఒకసారి జమ చేయనున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్రమంలో అడ్డంకులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం నిధులను ముందుగానే విడుదల చేసింది. ఈ విషయాన్ని వక్ప్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఎప్పటినుంచో ఇమామ్, మౌజామ్‌లకు గౌరవ వేతనాలను అందిస్తోంది. అందులో భాగంగా జులై నుంచి నిలిచిపోయిన గౌరవ వేతనాలను ఇప్పుడు ఒకేసారి అందిస్తున్నారు.

ఒకేసారి అకౌంట్లోెకి రూ.30 వేలు..

ఇమామ్‌లకు నెలకు రూ.10 వేల చొపున అందిస్తుండగా.. మౌజామ్‌లకు రూ.5 వేలు ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,991 ఇమామ్‌లు, 4991 మౌజామ్‌లకు కలిపి ప్రతీ నెలా 9982 మందికి వీటిని ప్రతీనెలా చెల్లిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో రాష్ట్రంలో డిసెంబర్ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో జీతాలు చెల్లించేందుకు సాంకేతికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ప్రభుత్వం ముందుగానే నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. అటు ఈ నెల 20వ తేదీన దసరా రోజున ఎన్నికల కార్యకలాపాలకు విరామం ఇస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీల సూచనతో ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఇప్పటికే విడుదలైన ఎన్నికల షెడ్యూల్‌లో కూడా ఈ నెల 20వ తేదీన ఎలాంటి కార్యకలాపాలు జరపకుండా చూసుకుంది.

స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు..

ఏపీ ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ నుంచి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మూడు విడతల్లో ఈ ఎన్నికలు జరపనున్నారు. నవంబర్ 26న తొలి విడత, ఆ తర్వాత 29వ తేదీన రెండో విడత, డిసెంబర్ 2వ తేదీన మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. నవంబర్ 13వ తేదీన తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్, నవంబర్ 16న రెండో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్, నవంబర్ 19న మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 14వ తేదీ నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

Follow Us
ఏపీలో వారికి శుభవార్త.. అకౌంట్లోకి రూ.30 వేలు.. రెడీగా ఉండండి..
ఏపీలో వారికి శుభవార్త.. అకౌంట్లోకి రూ.30 వేలు.. రెడీగా ఉండండి..
అర్ధరాత్రి వరకు చంద్రబాబు, కూటమి నేతల చర్చలు..
అర్ధరాత్రి వరకు చంద్రబాబు, కూటమి నేతల చర్చలు..
రైల్లో ప్రయాణిస్తున్నారా..? అక్టోబర్ 27 నుంచి కొత్త రూల్స్..
రైల్లో ప్రయాణిస్తున్నారా..? అక్టోబర్ 27 నుంచి కొత్త రూల్స్..
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తులా రాశిలో రవి సంచారం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్త
తులా రాశిలో రవి సంచారం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్త
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
సివిల్స్ అనగానే 18 గంటలు చదవాల్సిన అవసరంలేదు.. UPSC టాపర్ అనూదిప్
సివిల్స్ అనగానే 18 గంటలు చదవాల్సిన అవసరంలేదు.. UPSC టాపర్ అనూదిప్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్