Andhra Pradesh: అవన్నీ అబద్దాలే.. ఉద్యోగులకు అప్పటికల్లా జీతాలు ఇచ్చేస్తున్నాం.. జగన్ సర్కార్ క్లారిటీ..

|

Jan 23, 2023 | 9:01 AM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో చెల్లించడం లేదంటూ జోరుగా ప్రచారం కొనసాగుతోంది. దీనిపై సోషల్ మీడియాలో పలు రకాలుగా విమర్శలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

Andhra Pradesh: అవన్నీ అబద్దాలే.. ఉద్యోగులకు అప్పటికల్లా జీతాలు ఇచ్చేస్తున్నాం.. జగన్ సర్కార్ క్లారిటీ..
AP Govt
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో చెల్లించడం లేదంటూ జోరుగా ప్రచారం కొనసాగుతోంది. దీనిపై సోషల్ మీడియాలో పలు రకాలుగా విమర్శలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల సంక్షేమం, జీతాలు, పెన్షనర్‌ల చెల్లింపులో జాప్యం అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ స్పందించింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో 90 నుంచి 95 శాతం మందికి 5వ తేదీలోపే జీతాలను అందిస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగులను మానవ వనరులుగా భావిస్తున్నామని.. ఉద్యోగులే తమకు పెద్ద ఆస్తి అంటూ పేర్కొంది. రాష్ట్ర విభజన సమస్యలు, కోవిడ్ సంక్షోభం ఉన్నా జీతాలు, పెన్షన్లు ఆపలేదని స్పష్టంచేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను ఇందులో స్పష్టంగా వెల్లడించారు.

రాష్ట్ర విభజన అనంతర సమస్యలు, కోవిడ్ పరిస్థితుల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రతి నెలా 5 తేదీన 90 నుంచి 95 శాతం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను ప్రభుత్వం చెల్లిస్తున్నట్టు దానిలో వివరించారు. మిగిలిన 5 శాతం మందికి ఖజానాలో బిల్లలు సమర్పించిన తేదీకి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నట్లు తెలిపారు. ఉద్యోగుల జీతాల బిల్లులు ఖజానా అధికారులకు నెలాఖరులోగా సమర్పించగలిగితే ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇవ్వగలమని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల బిల్లలు 90 నుంచి 95 శాతం వరకు నెలాఖరు రోజున ఖజానా అధికారులు పాస్ చేస్తారని.. వాటి చెల్లింపులు ఆ మరుసటి నెల 5వ తేదీలోగా పూర్తిచేస్తున్నట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న పలు పరిస్థితుల ఆధారంగా ఈ చెల్లింపులు కొనసాగుతున్నాయన్నారు. గతంలో పద్దతి మాదిరిగానే ఇప్పుడు కూడా ప్రక్రియ కొనసాగుతుందని.. ఇలాంటి ప్రచారాలను, ఆరోపణలను నమ్మాల్సిన పనిలేదని స్పష్టంచేశారు.

అవాస్తవ ప్రచారాలను నమ్మోద్దంటూ ప్రభుత్వం సూచించింది. వాస్తవాలు లేకుండా ప్రచురితమైన వార్తలు, పరువు నష్టం కలిగించే విధంగా చేస్తున్న ప్రచారాలపై ప్రభుత్వం చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..