Andhra Pradesh: ఇవాళ ఏపీ బడ్జెట్‌.. ఈ ఏడాది బడ్జెట్‌ అంచనా ఎంత.? ఏ రంగానికి ఎంత ఖర్చు చేయనున్నారు.

గురువారం (నేడు) మంత్రి బుగ్గన 2023-24 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 7 గంటలకు మంత్రి ఛాంబర్ లో బడ్జెట్ కాపీలకు ప్రత్యేక పూజ నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 8 గంటలకు కేబినెట్ ప్రత్యేక భేటీ నిర్వహించనుంది...

Andhra Pradesh: ఇవాళ ఏపీ బడ్జెట్‌.. ఈ ఏడాది బడ్జెట్‌ అంచనా ఎంత.? ఏ రంగానికి ఎంత ఖర్చు చేయనున్నారు.
Ap Budget (file Photo)

Updated on: Mar 16, 2023 | 8:08 AM

గురువారం (నేడు) మంత్రి బుగ్గన 2023-24 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 7 గంటలకు మంత్రి ఛాంబర్ లో బడ్జెట్ కాపీలకు ప్రత్యేక పూజ నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 8 గంటలకు కేబినెట్ ప్రత్యేక భేటీ నిర్వహించనుంది. ఈ భేటీలో బడ్జెడ్‌కు కేబినేట్‌ ఆమోదం తెలపనుంది. ఉదయం 10 గంటలకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న బుగ్గన. 2.79 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ రూపొందించినట్లు సమాచారం. తర్వాత వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న మంత్రి కాకాణి. మండలిలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా.

అలాగే మండలిలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో తాజా బడ్జెట్ లో భారీగా కేటాయింపులు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది ఏపీ సర్కార్. వివిధ శాఖలకు కేటాయింపులు ఏ విధంగా ఉంటాయోననే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈసారి కూడా ఎప్పటిలాగే వ్యవ‌సాయానికి ప్రత్యేక బ‌డ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.

ఎన్నిక‌ల బడ్జెట్ కావ‌డంతో గతం కంటే ఎక్కువ‌ కేటాయింపుల‌తో బ‌డ్జెట్ రూపకల్పన చేసిన‌ట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలకు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని, విద్య, వైద్యం, సంక్షేమం, సాగునీటి రంగాల‌కు అధిక కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం గతేడాది కూడా ఈ రంగాలకే అధిక ప్రాధన్యత ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..