రెండోసారి అధికారమే లక్ష్యంగా ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. పరదాల వీరుడు అంటూ విపక్షాలు చేసిన విమర్శలకు బస్సు యాత్రతో సమాధానం చెప్పేశారు వైఎస్ జగన్. సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు ఏకంగా జరుగుతున్నాయి. ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల ముందే బస్సు యాత్రతో రాష్ట్ర రాజకీయ రూపురేఖలే మార్చేసిన ఆ స్కెచ్ ఏంటి? తాజా రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పు ఏంటి? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జగన్ బస్సు యాత్రపై చర్చ నడుస్తోంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చి వేస్తోంది. వైసీపీ అధ్యక్షుడు హోదాలో వైఎస్ జగన్. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్న బస్సు యాత్ర ప్రతిపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పట్టణం, గ్రామం నుంచి ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి, సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు.
సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మాజీ ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకుల చేరికలు వెల్లువలా సాగుతున్నాయి. బస్సు యాత్ర చేపట్టిన నాటి నుంచి నేటి వరకు 221 మంది ప్రజాప్రతినిధుల చేరికతో వైసీపీ మరింత బలపడింది. గత 35 రోజుల్లో వైసీపీలోకి 1,05,000 మందికి పైగా పంచాయతీ, వార్డు స్థాయి నేతలు, కార్యకర్తలు చేరగా, దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని ఒక సరికొత్త రికార్డును వైసీసీ నెలకొల్పింది.
రాబోయే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మండల స్థాయి నాయకుల నుంచి మాజీ ఎమ్మెల్యేల, మాజీ మంత్రుల వరకు కీలకనేతల నుంచి, కింది స్థాయి కార్యకర్తలతో కలిసి వేలాదిగా సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీలోకి చేరారు. మార్చి 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభ మైనప్పటి నుంచి చేరుకల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. దీంతో ఇప్పటి వరకు విపక్ష పార్టీల నుంచి చేరికతో వైసీపీలో ఫుల్ జోష్ నెలకొంది. ఒక్కో జిల్లాలో సీఎం పర్యటనలు మొదలవుతున్న తరుణంలో వైసీపీలో పంచన చేరాలనుకుంటున్న నేతల సంఖ్య పెరుగుతూనే ఉంది.
తాజా మాజీల చేరికతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ వేవ్ 2024 స్పష్టంగా కనిపిస్తోంది,175 స్థానాలకు 175 సీట్లు సాధించడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. 19 రోజుల మేమంతా సిద్దం బస్సు యాత్రలో టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ సహా ప్రత్యర్థి పార్టీలకు చెందిన దాదాపు 138 మంది ప్రముఖ నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీకి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఇక యాత్రకు ముందే మరో 83 మంది నాయకులు వైసీపీలో చేరారు, నేతల చేరికతో ఇటీవల వైసీపీలో చేరిన వారి సంఖ్య 221కి చేరుకుంది. నేతల చేరికతో పాటు గత 35 రోజులలో విపక్షాలకు చెందిన ముఖ్యనాయకులు 105,000 మందితోపాటు క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా వైసీపీలో చేరారు, ముఖ్యంగా టీడీపీ కంచుకోటగా చెప్పుకునే విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఈ చేరికలు మరింత ఊపందుకున్నాయి.
ఇటివల వైసీపీలో చేరిన వారిలో రాష్ట్ర స్థాయిలో పదవుల్లో ఉన్న టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి పెందుర్తి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్. కరీముల్లా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ వృత్తి విభాగం ప్రధాన కార్యదర్శి వసీం అక్రమ్, మాజీ కార్పొరేటర్, టీడీపీ మైనారిటీ రాష్ట్ర నాయకుడు నజీర్ హుస్సేన్ సహా గుంటూరులో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఇక కడప, కర్నూలు జిల్లాల నుంచి వైసీపీలో చేరిన వారిలో ప్రతిపక్ష పార్టీలలో ముఖ్యంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్త కోట ప్రకాష్ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ప్రెసిడెంట్ జీవన్ సింగ్ ఉన్నారు. వీరంతా సీఎం జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. కాకినాడ అనకాపల్లి నుంచి పిఠాపురం నుంచి మాకినీడు శేషు కుమారి, ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ, అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాజబాబు, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, రాజోలు నుంచి బొంతు రాజేశ్వరరావు, రాజానగరం నుంచి జనసేన మాజీ ఇంచార్జి మేడా గురుదత్త ప్రసాద్ తదితరులు టీడీపీ, జనసేనల నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన ప్రముఖులుగా ఉన్నారు. అలాగే నర్సీపట్నం నుంచి జనసేన సీనియర్ నేత రుత్తల యర్రాపాత్రుడు, పాపయ్యపాలెం నుంచి వి.లక్ష్మి కూడా వైసీపీ కండువా కప్పుకొన్నారు.
జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైసీపీలో చేరారు. వీరితో పాటు రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉమా మహేశ్వర్ నాయుడు, కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే కోట్ల హరి చక్రపాణిరెడ్డి, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే లలితకుమారి థామస్, నెల్లూరులో హరికృష్ణ, జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి, పెద్దాపురం మాజీ అభ్యర్థి తోట సుబ్బారావు నాయుడు, ప్రత్తిపాడు నుంచి మాజీ మున్సిపల్ ఛైర్మన్ పైలా బోస్, 2019లో గురజాల నుంచి జనసేన తరఫున పోటీ చేసిన చింతలపూడి శ్రీనివాసరావు, ఆలిండియా ఎస్సీ, ఎస్టీ సంఘం అధ్యక్షుడు, అమలాపురానికి చెందిన జనసేన సీనియర్ నాయకుడు డీఎంఆర్ శేఖర్, దుర్గాభవాని తదితరులు తమ క్యాడర్‌తో కలిసి మేమంతా సిద్ధం యాత్రలో వైసీపీలో చేరారు..
మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రతో విపక్షం చెక్ పెట్టేశారు ఎప్పటి వరకు తెలుగుదేశం జనసేన పార్టీలో క్రియాశీలకంగా నేతలను పార్టీలోకి పిలిచి మరియు ఆహ్వానించి కండువా కప్పేశారు బస్సు యాత్ర ఒక ఊపు రాష్ట్ర రాజకీయాల్లో తీసుకురావడంతో పాటు మరో నూతన అధ్యయనానికి నాంది పలికింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..