ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ పరీక్ష (ఏపీ ఈసెట్-2023) పరీక్ష వాయిదా పడింది. మే 5న నిర్వహించవలసిన ఈ పరీక్షను జూన్ 20కు వాయిదా వేసినట్లు ఏపీ ఈసెట్ ఛైర్మన్, జేఎన్‌టీయూకే ఉపకులపతి ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజు ఓ ప్రకటనలో వెల్లడించారు. బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సులకు సంబంధించి ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షను వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ ఆఖరి సంవత్సరం పరీక్షలు పూర్తికాకపోవడంతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ లో చెక్ తెలుసుకోవచ్చని అన్నారు. సందేహాలకు 85004 04562 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కన్వీనర్ ఆచార్య ఎ కృష్ణమోహన్ తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (అనంతపూర్) పరిధిలో ఈ పరీక్షను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈసెట్ అడ్మిట్ కార్డులు పరీక్ష తేదీకి 15 రోజుల ముందు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.