AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త.. అందుబాటులోకి వచ్చిన మరో ఫుడ్‌ కౌంటర్‌

తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. భక్తుల కోసం తాజాగా మరో ఫుడ్‌ కౌంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలో ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద..

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త.. అందుబాటులోకి వచ్చిన మరో ఫుడ్‌ కౌంటర్‌
TTD NEWS
Narender Vaitla
|

Updated on: Apr 23, 2023 | 4:25 PM

Share

తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. భక్తుల కోసం తాజాగా మరో ఫుడ్‌ కౌంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలో ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు పాత అన్నదానం కాంప్లెక్స్‌, పీఎసీ-2లో అన్నప్రసాద వితరణ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీటి సరసన మరో ఫుడ్‌ కౌంటర్‌ను అదివారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. టీటీడీ భైర్మన్‌ వైవి. సుబ్బారెడ్డి ఆదేశాల మేరకే పీఎసీ-1 వద్ద కొత్త ఫుడ్‌ కౌంటర్‌ను ప్రారంభించారు.

టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో ఈ ఫుడ్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ముందుగా శ్రీవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నప్రసాదాల పంపిణీని ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కొత్త ఫుడ్‌ కౌంటర్‌తో తిరుమలలో మొత్తం ఫుడ్ కౌంటర్ల సంఖ్య మూడుకు చేరాయి.

ఇదిలా ఉంటే వారాంతం కావడంతో తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. శనివారం శ్రీవారిని 72,631 మంది భక్తులు దర్శించుకోగా 38,529 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.85 కోట్లుగా నమోదైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో