AP EAPCET-2023: ఏపీ ఈఏపీసెట్‌-2023కు 2.80 లక్షల దరఖాస్తులు.. లేట్ ఫీ లేకుండా మరో 4 రోజుల వరకే

|

Apr 11, 2023 | 9:07 PM

ఏపీ ఈఏపీసెట్‌-2023 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఏప్రిల్‌ 11వ తేదీ ఉదయం నాటికి మొత్తం 2,80,779 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఈఏపీసెట్‌ ఛైర్మన్, అనంతపురం జేఎన్‌టీయూ వీసీ ఆచార్య రంగజనార్దన..

AP EAPCET-2023: ఏపీ ఈఏపీసెట్‌-2023కు 2.80 లక్షల దరఖాస్తులు.. లేట్ ఫీ లేకుండా మరో 4 రోజుల వరకే
AP EAPCET 2023
Follow us on

ఏపీ ఈఏపీసెట్‌-2023 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఏప్రిల్‌ 11వ తేదీ ఉదయం నాటికి మొత్తం 2,80,779 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఈఏపీసెట్‌ ఛైర్మన్, అనంతపురం జేఎన్‌టీయూ వీసీ ఆచార్య రంగజనార్దన తెలిపారు. ఈఏపీసెట్‌ కన్వీనర్‌ ఆచార్య శోభాబిందుతో కలసి మంగళవారం (ఏప్రిల్‌ 11) అనంతపురంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 30 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో మే 5 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో మే 12 వరకు, రూ.10 వేల ఆలస్య రుసుముతో మే 14 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో వెంటనే దరఖాస్తు చేసుకోవల్సిందిగా ఆయన సూచించారు.

కాగా మే 15 నుంచి 22వ తేదీ వరకు ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు, మే 23 నుంచి 25 వరకు అగ్రికట్చర్‌ స్ట్రీమ్‌కు ఆన్‌లైన్‌ విధానంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటికి అడ్మిట్‌ కార్డులు మే 7వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా గతేడాది 3,00,111 మంది విద్యార్ధులు ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.