AP Corona Cases: ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 44,382 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 158 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 887010కి చేరుకుంది.

AP Corona Cases: ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
corona-ap

Updated on: Jan 24, 2021 | 5:49 PM

AP Corona Cases: ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 44,382 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 158 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 8,87,010కి చేరుకుంది. కోవిడ్-19 కారణంగా కొత్తగా ఒక్క మరణం కూడా సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7147గా ఉంది. తాజాగా 155 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. టోటట్‌గా రికవరీల సంఖ్య 878387గా ఉంది. ఆదివారం(24-01-2021) వరకు రాష్ట్రంలో 1,28,76,113 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్యారోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1476 యాక్టివ్ కేసులున్నాయి.

కరోనాకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్‌కు  (8297-104-104) Hi, Hello, Covid అని మెసేజ్ చేయమని వైద్యారోగ్య శాఖ సూచించింది. స్మార్ట్ ఫోన్ లేనివారు   8297-104-104 కు ఫోన్ చేసి ఐవీఆర్‌ఎస్ ద్వారా కరోనా సంబంధించిన సమాచారం, సహాయం పొందవచ్చని తెలిపారు. మరోవైపు ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలి దశలో హెల్త్ కేర్ వర్కర్లు కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు. త్వరలో ప్రజలకు సైతం వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభం కానుంది.

Also Read:

India Corona Cases: దేశంలో కొత్తగా 14,849 కోవిడ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా..

తెలంగాణ కరోనా రౌండప్ : రాష్ట్రంలో కొత్తగా 197 పాజిటివ్ కేసులు.. రేపట్నుంచి ప్రవేట్ హెల్త్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సిన్