Rythu Bharosa: అన్నదాతలకు అండగా వైఎస్ఆర్ రైతు భరోసా.. ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్‌

|

May 13, 2021 | 12:14 PM

ys jagan released rythu bharosa installment: కరోనా కష్టాల మధ్య రైతులు ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు భరోసా ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ

Rythu Bharosa: అన్నదాతలకు అండగా వైఎస్ఆర్ రైతు భరోసా.. ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్‌
Cm Ys Jagan
Follow us on

ys jagan released rythu bharosa 1st installment: కరోనా కష్టాల మధ్య రైతులు ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు భరోసా ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లోకి తొలి విడత పెట్టుబడి సాయాన్ని జమ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా నిధులు విడుదల చేశారు. రైతు భరోసా కింద ఈ ఏడాది 52 లక్షల 38 వేల 517 రైతు కుటుంబాలు అర్హత పొందాయి. గత ఏడాది కన్నా ఈసారి 79 వేల 472 కుటుంబాలు అదనంగా ప్రయోజనం పొందనున్నాయి. వీరిలో 1 లక్షా 86 వేల 254 మంది భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అటవీ సాగుదారులున్నారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ .. రైతులకు మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ కింద మూడో ఏడాది తొలి విడత సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. 52.38 లక్షల మంది రైతులకు రూ.3,928.88 కోట్ల సాయం అందిస్తున్నామని జగన్ తెలిపారు. అర్హులైన రైతులకు ఏటా మూడు విడతలుగా రూ.13,500 సాయం తప్పకుండా అందిస్తామని తెలిపారు. దీనిలో భాగంగా మొదటి విడత కింద రూ.7,500 సాయం అందిస్తున్నామన్నారు. కోవిడ్ కష్టకాలంలోనూ రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ వెల్లడించారు.

వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ కింద ప్రభుత్వం ప్రతి ఏటా మూడు విడతల్లో 13 వేల 500 రూపాయలు పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తంలో 7 వేల 500 రూపాయలు మే నెలలో, 4 వేల రూపాయలు అక్టోబర్‌లో, మిగిలిన 2 వేలు జనవరిలో జమ చేస్తున్నారు. భూ యజమానులకు మాత్రమే పీఎం కిసాన్‌ కింద కేంద్రం మూడు విడతల్లో రూ.6 వేల చొప్పున జమ చేస్తోంది. ఇక ఎలాంటి భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుబడిసాయం అందిస్తోంది. దేవదాయ, అటవీ, వక్ఫ్‌ తదితర ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న కౌలుదారులకు 13 వేల 500 రూపాయల చొప్పున వైఎస్సార్‌ రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.

Also Read:

TSSPDCL Power Bill: మీ ఇంటి కరెంట్ మీటర్ రీడింగ్ మీరే తీసుకోవచ్చు..! అయితే ఇలా చేయండి..!

డయాబెటీస్ ఉన్నవారు పొరపాటున కూడా ఈ పండ్లు తినకూడదు..! ఎందుకో తెలుసుకోండి..