YS Jagan: చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పేదలకు శత్రువులు.. సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు..

|

Dec 07, 2022 | 7:37 PM

విజయవాడ జయహో బీసీ మహాసభ వేదికగా సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. గంటా 20 నిమిషాల సేపు మాట్లాడిన ముఖ్యమంత్రి బీసీ ప్రజాప్రతినిధుల్ని, పార్టీ కేడర్‌ను ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

YS Jagan: చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పేదలకు శత్రువులు.. సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు..
Ys Jagan
Follow us on

విజయవాడ జయహో బీసీ మహాసభ వేదికగా సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. గంటా 20 నిమిషాల సేపు మాట్లాడిన ముఖ్యమంత్రి బీసీ ప్రజాప్రతినిధుల్ని, పార్టీ కేడర్‌ను ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల యుద్ధంలో 175కి 175 సీట్లు సాధించాలని జగన్‌ వైసీపీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఇప్పటి నుంచే గడప గడపకు వెళ్లాలని బీసీ ప్రజాప్రతినిధులకు సూచించారు. టీడీపీ హయాంలో బీసీలకు ఏం చేశారు, ఈ మూడున్నరేళ్లలో తమ ప్రభుత్వం ఏం చేసిందన్న దాన్ని సుదీర్ఘంగా లెక్కలతో సహా వివరించారు ముఖ్యమంత్రి జగన్‌. బీసీలకే రూ.1.63 లక్షల కోట్లను ఖర్చు చేశామని, DBT ద్వారానే రూ.86 వేల కోట్లును సాయం చేశామని లెక్కలతో సహా చెప్పారు. బీసీల పరంగా ఆర్థిక, రాజకీయ, సామాజిక, మహిళ, విద్యా సాధికారతల్లో ఏం చేశామన్నది చెప్పారు. చంద్రబాబు అన్నేళ్లు సీఎంగా ఉన్నా బీసీలకు అన్యాయమే చేశారంటూ విమర్శలు గుప్పించారు.

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలంటూ సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమమే వైసీపీ ఆత్మ అన్నారు. తన మనసంతా పేదలే ఉన్నారని, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పేదల వ్యతిరేకులంటూ పరోక్షంగా పవన్‌ను విమర్శించారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పేదలకు శత్రువులంటూ పేర్కొన్నారు.

18 నెలల్లో యుద్ధం జరగబోతోందని.. అంతా సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. 2024లో 175 సీట్లలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని.. గడప గడపకు వెళ్లాలని బీసీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. బూత్‌ కమిటీలు కూడా ఏర్పాటు కావాలంటూ సూచించారు. ప్రతి 50 ఇళ్లకు ఒకరు బాధ్యత తీసుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ న్యూస్ కోసం