CM YS Jagan: దశాబ్ధాల కల సాకారమైన వేళ.. ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం.!

|

Dec 14, 2023 | 1:51 PM

దశాబ్దాల కల సాకారమైంది. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతం పేరెత్తితే కిడ్నీ బాధితులు గుర్తుకొస్తారు. రాష్ట్రంలో ఎక్కడ లేనంతగా ఇక్కడ అత్యధిక సంఖ్యలో కిడ్నీ బాధితులు ఉండటమే ఇందుకు కారణం. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించింది. దీంతో వారి కష్టాలు తీరనున్నాయి.

CM YS Jagan: దశాబ్ధాల కల సాకారమైన వేళ.. ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం.!
Ap Cm Ys Jagan
Follow us on

దశాబ్దాల కల సాకారమైంది. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతం పేరెత్తితే కిడ్నీ బాధితులు గుర్తుకొస్తారు. రాష్ట్రంలో ఎక్కడ లేనంతగా ఇక్కడ అత్యధిక సంఖ్యలో కిడ్నీ బాధితులు ఉండటమే ఇందుకు కారణం. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించింది. దీంతో వారి కష్టాలు తీరనున్నాయి.

పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో కిడ్నీ హాస్పిటల్ కం రీసెర్చ్ సెంటర్‌తో పాటు ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ నూతనంగా నిర్మించింది జగన్ ప్రభుత్వం. ఏళ్లకు ఏళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో సతమతం అయ్యే ఉద్దానం ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఉద్దానం కిడ్నీ బాధితులకు ఒకపక్క సురక్షితమైన తాగునీటిని అందించడమే కాకుండా అత్యున్నత ప్రమాణాలతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. అలాగే రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజలధార ప్రాజెక్టును సిద్ధం చేసింది. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన చేతుల మీదుగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్‌ యూనిట్ల ఏర్పాటు చేసింది. మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం జరిగింది. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్‌ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్‌ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్‌ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్‌ ల్యాబ్‌తో ఇలా ప్రత్యేక వార్డులు ఉన్నాయి. జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో ఇప్పటికే 42 స్పెషాలిటీ డాక్టర్‌ పోస్టులు, 60 స్టాఫ్‌ నర్సు పోస్టులు, 60 ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ చేసింది ఏపీ ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ప్రబలంగా ఉన్న ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలకు సుజలధార‘ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన తాగునీరు అందిస్తోంది. హిరమండలం రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా చేస్తోంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం 6 లక్షలకుపైగా జనాభా ఉండగా అవసరాలకు సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మాణం చేసింది వైసీపీ ప్రభుత్వం.

పలాసలో జగన్ స్పీచ్..

ఉద్దానంలో తాను పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడి ప్రజల కష్టాలను తెలుసుకున్నా అన్నారు. 2018లో విన్న మీ కష్టం ఇప్పటికీ గుర్తుందని చెప్పారు. అందుకే ఉద్దానం కిడ్నీ బాధితులకు మీ అందరి ప్రభుత్వం నేడు అండగా నిలిచిందన్నారు. వేల కోట్లు ఖర్చు చేసి కిడ్నీ రీసర్చ్ సెంటర్ తో పాటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించామన్నారు. అలాగే సురక్షిత సాగు నీటిని అందించి కిడ్నీ వ్యాధికి శాశ్వత పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.  ప్రతి పక్షంలో కాదు అధికారంలో ఉండి కూడా చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏమీ చేయలేదన్నారు. కుప్పంనే పట్టించుకోని చంద్రబాబు ఉత్తరాంధ్రను పట్టించుకుంటారా అని ప్రశ్నించారు. ఈ నాన్ లోకల్స్ విషయంలో ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలంగాణలో బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా దత్త పుత్రుడికి రాలేదని ఎద్దేవా చేశారు. వీళ్లంతా హైదరాబాద్ లో ఉంటూ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని తెలిపారు. పార్టీలు చూడకుండా అక్కచెల్లెమ్మలకు ఈ ప్రభుత్వం అండగా నిలిచింది అని చెప్పుకొచ్చారు. మన ప్రభుత్వం ఏం చేసినా వీళ్లకు ఏడుపే అని తీవ్రంగా విమర్శిచారు.

పూర్తి వీడియో..

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..