R5 Zone Site Pattas: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం పేరుతో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూనుకుంది. ఈ మేరకు అమరావతి వేదికగా ఏర్పాటు చేసిన సభలో శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ‘రూ. 7లక్షల నుంచి రూ. 10 లక్షలు విలువ చేసే ఇంటిస్థలాలను పేద ప్రజలకు ఇస్తున్నాం. ఇవి ఇళ్ల పట్టాలు మాత్రమే కాదు.. సామాజిక న్యాయ పత్రాలు. అమరావతి ఇక నుంచి సామాజిక అమరావతి, అందరి అమరావతి అవుతుంద’న్నారు.
ఇంకా ‘దేశ చరిత్రలోనే అమరావతి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. పేదల కోసం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి విజయం సాధించాం. మన ప్రభుత్వమే సుదీర్ఘంగా న్యాయపోరాటం చేసింది. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుంటా కుట్రలు చేసి కోర్టులకెళ్లి మరీ అడ్డుకునే యత్నం చేశారు. కానీ మనకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఇది పేదల విజయం’ అని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని, ఎన్నికలు రాగానే మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తారని. మోసం చేసే ఆయన్ను నమ్మవద్దని, నరకాసురిడినైనా నమ్మొచ్చుకానీ నారా చంద్రబాబును నమ్మకూడదని అన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..