Andhra Pradesh: ఫ్రీగా పెట్రోల్.. భారీగా క్యూ కట్టిన జనం.. ఎక్కడో తెలుసా.?

Andhra Pradesh News: అసలే పెట్రోల్ డీజిల్ ధరలు నానాటికి పెరిగిపోతున్నాయి. బండికి పెట్రోల్ కొట్టించుకోలేక చాలామంది ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. కొంతమంది పెట్రోల్ బైకులను పక్కనపెట్టి బ్యాటరీ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ సమయంలో పెట్రోల్ ఫ్రీగా వస్తుందంటే..

Andhra Pradesh: ఫ్రీగా పెట్రోల్.. భారీగా క్యూ కట్టిన జనం.. ఎక్కడో తెలుసా.?
Petrol Bunk
Follow us
Ravi Kiran

|

Updated on: May 26, 2023 | 1:13 PM

అసలే పెట్రోల్ డీజిల్ ధరలు నానాటికి పెరిగిపోతున్నాయి. బండికి పెట్రోల్ కొట్టించుకోలేక చాలామంది ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. కొంతమంది పెట్రోల్ బైకులను పక్కనపెట్టి బ్యాటరీ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ సమయంలో పెట్రోల్ ఫ్రీగా వస్తుందంటే ఎవరైనా వదులుతారా. రండి బాబు రండి అని చెప్పగానే… వందలాది వాహనాలు క్యూ కట్టాయి. ఎంతలా అంటే పోలీసులు కూడా వారిని కంట్రోల్ చేసే అంత స్థాయికి వచ్చింది. పరిమితంగానే పెట్రోల్ పోసి ఆ తర్వాత ఆపేసారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఈ ఘటన జరిగింది.

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని ఓ సంస్థ ప్రతినిధి తన కుటుంబ సభ్యుడి జన్మదినం సందర్భంగా పెట్రోలు ఫ్రీగా పంపిణీ చేయాలని అనుకున్నాడు. ఒక్కొక్కరికి రెండు లీటర్ల పెట్రోల్ చొప్పున కూపన్లను పంపిణీ చేశాడు. నక్కపల్లి పెట్రోల్ బంకులో పెట్రోల్ పంపిణీకి సిద్ధం అయ్యారు. రెండు లీటర్ల పెట్రోల్ కూపన్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రచారం చేయాదంటో జనం వాహనాలతో భారీగా చేరుకున్నారు. 150 మందికి కూపన్లు పంపిణీ చేశారు. కాగా ఫ్రీ పెట్రోల్ వ్యవహారం ఆ నోట ఇనోటా పాకడంతో జనం వాహనాలతో బారులు తీరారు.

జాతీయ రహదారి వెంట వెళ్లే వాళ్లు ఏమి జరు గుతుందో అర్థం కాక, ఆశ్చర్యంగా చూశారు. అసలు విషయం తెలుసుకుని కూపన్ల కోసం వాళ్లు కూడా పరుగులు తీశారు. కూపన్లు అయిపోయినప్పటికీ జనాల రద్దీ తగ్గలేదు. ఇక పోలీసులు రంగంలోకి దిగారు… మిగిలిన వారిని బయటకు పంపేశారు. కూపన్లు దక్కించుకున్న వారు హ్యాపీగా రెండు లీటర్ల పెట్రోల్ ఫ్రీగా కొట్టించుకుని వెళితే.. విషయం తెలిసి అక్కడకు చేరుకొని కూపన్లు దక్కని వాహనదారులు పెదవి విరుస్తూ వెనుదిరిగారు.