Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Washington DC: బైడెన్‌ను చంపుతానన్న తెలుగు కుర్రాడికి పదేళ్ల జైలుశిక్ష!.. రూ. 2 కోట్లకు పైగా జరిమానా..!

Washington DC: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను చంపుతానంటూ తెలుగు యువకుడు సాయి వర్షిత్‌ కందుల రెండు రోజుల క్రితం ట్రక్కుతో వెళ్లి వైట్ హౌజ్ బారికేడ్లను ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు అతన్ని బుధవారం ఫెడరల్‌ కోర్టు జడ్జి రాబిన్‌ మెరివెదర్‌..

Washington DC: బైడెన్‌ను చంపుతానన్న తెలుగు కుర్రాడికి పదేళ్ల జైలుశిక్ష!.. రూ. 2 కోట్లకు పైగా జరిమానా..!
Sai Varshith Kandula
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 26, 2023 | 8:32 AM

Washington DC: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను చంపుతానంటూ తెలుగు యువకుడు సాయి వర్షిత్‌ కందుల రెండు రోజుల క్రితం ట్రక్కుతో వెళ్లి వైట్ హౌజ్ బారికేడ్లను ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు అతన్ని బుధవారం ఫెడరల్‌ కోర్టు జడ్జి రాబిన్‌ మెరివెదర్‌ ఎదుట వర్షిత్‌ను హాజరుపరచగా, మే 30 దాకా కస్టడీకి ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు వర్షిత్‌కు వర్షిత్​కు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 కోట్ల(2,50,000  అమెరికన్ డాలర్లు) జరిమానా విధించే అవకాశముంది. ఇక అంతకముందు ఆరెంజ్ కలర్ జంప్‌సూట్‌లో కోర్టుకు హాజరైన వర్షిత్‌ జడ్జి అడిగిన ప్రశ్నలకు ఎంతో వినయంగా, పొడిగా బదులిచ్చాడు.

అయితే ఆస్తుల విధ్వంసం, నిర్లక్ష్యంగా వాహనం నడపటం, అధ్యక్షుణ్ని చంపుతానని బెదిరించటం, అనుమతి లేకుండా వైట్‌హౌజ్ పరిసరాల్లోకి చొరబడటం వంటి పలు అభియోగాలతో వర్షిత్‌పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేరాలకు గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్ష, రూ.2 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉందని, వచ్చే వారం తదుపరి విచారణ ఉంటుందని నిందితుడి తరఫు న్యాయమూర్తి అన్నారు.

కాగా, అమెరికా మిసోరికి చెందిన సాయి వర్షిత్‌ సోమవారం రాత్రి ఓ ట్రక్కు నడుపుతూ వైట్‌హౌజ్ వైపుగా దూసుకుపోయి ట్రక్కు సెక్యూరిటీ బారికేడ్లను ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అలాగే ట్రక్కులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని, నాజీ జెండాలను మాత్రమే  గుర్తించిన పోలీసులు వర్షిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని నిలదీసి ప్రశ్నించగా బైడెన్‌ను తొలగించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యమని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..