AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: అప్పుడు ఐటీ.. ఇప్పుడు ఏఐ.. దావోస్‌లో బిల్‌ గేట్స్‌తో చంద్రబాబు భేటి..

దావోస్ వేదికపై ఏపీ బ్రాండ్‌ని ఎక్స్‌పోజ్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు. తెలంగాణ ప్రభుత్వమైతే రెండు భారీ డీల్స్‌ ఓకే చేసుకుని.. దూకుడు మీదుంది. భేటీలు, చర్చలు, ఒప్పందాలు అటుంచితే.. వీటన్నిటికీ మించి దావోస్‌లో హైలైట్స్ చాలానే ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

AP News: అప్పుడు ఐటీ.. ఇప్పుడు ఏఐ.. దావోస్‌లో బిల్‌ గేట్స్‌తో చంద్రబాబు భేటి..
Ap News
Ravi Kiran
|

Updated on: Jan 22, 2025 | 9:10 PM

Share

దావోస్‌ టూర్‌లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పెట్టుబడుల వేట కొనసాగుతోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో పార్టిసిపేషన్ కోసం వెళ్లిన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి మిషన్ దావోస్‌పై సీరియస్‌గా వర్కవుట్ చేస్తున్నారు. బిల్డింగ్‌ ది నెక్ట్స్ పెట్రోకెమికల్ హబ్ అనే అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ చర్చలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. పోర్టులు, లాజిస్టిక్స్, స్కిల్డ్ టాలెంట్.. అన్నిటికీ ఏపీ కేరాఫ్ ఐందన్నారు.

టెక్నాలజీ గ్లోబల్ లీడర్‌గా ఉన్న కాగ్నిజెంట్ సంస్థ సీఈఓ ఎస్. రవికుమార్‌తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు ఏపీ బెటర్ ప్లేస్ అని చెప్పారు. తర్వాత.. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన టెక్నలాజికల్ ఎడ్వాన్స్‌మెంట్‌ను వివరించారు. నిపుణులైన యువత ఉన్న ఏపీ.. ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ కాబోతోందని చెప్పారు. తర్వాత టెక్ దిగ్గజం బిల్‌గేట్స్‌తో భేటీ అయ్యారు. అప్పుడు ఐటీ కోసం, ఇప్పుడు ఏఐ కోసం మేమిద్దరం అంటూ గత జ్ఞాపకాల్ని షేర్ చేసుకున్నారు. బిల్‌ గేట్స్‌ని మళ్లీ కలుసుకోవడం ఆహ్లాదకరం అన్నారు సీఎం చంద్రబాబు.

పెట్టుబడులు రాబట్టడమే టార్గెట్‌గా దావోస్‌ టూరేసిన రేవంత్ బృందం తాజాగా మరో ఒప్పందం కుదుర్చుకుంది. కంట్రోల్-S సంస్థతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం.. హైదరాబాద్‌లో 400 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌ రాబోతోంది. డీల్ వ్యాల్యూ దాదాపు 10 వేల కోట్ల రూపాయలు. అటు.. తెలంగాణ పెవిలియన్‌లో HCL టెక్‌ సీఈవో చర్చలు జరిపారు సీఎం రేవంత్‌, మంత్రి శ్రీధర్‌బాబు. హైదరాబాద్‌లో కొత్త టెక్‌ సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి HCLతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో HCL సంస్థకు ఇది ఐదవ ఐదవ క్యాంపస్.

హిటాచీ ఇండియా ఎండీ భరత్‌ కౌశల్‌తో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్. హెచ్‌వీడీసీ సాంకేతికత అమలులో సహకరించాలని కోరారు. WTCA గ్లోబల్‌ చైర్మన్ జాన్‌ డ్రూతో సమావేశమై.. ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ల ఏర్పాటు చేయాలని విన్నవించారు. టెమాసెక్‌ హోల్డింగ్స్‌ భారత్‌ హెడ్‌ రవి లాంబాతో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని, విశాఖ, తిరుపతిలో కమర్షియల్‌ స్పేస్‌ ఏర్పాటు చేయాలని కోరారు. టీమ్ ఇండియా ఎట్ దావోస్.. అంటూ ఏపీ సీఎంఓ ఖాతాలో స్పెషల్ పిక్ పోస్ట్ మెరిసింది. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి తీసుకున్న గ్రూప్ ఫోటో ఇది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే