ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ స్కామ్ బయటపడింది. గుడ్‌షెఫర్డ్, ఆర్ అండ్ ఆర్ ఫౌండేషన్ పేరుతో భారీ మొత్తంలో టోకరా వేశారు. చర్చ్‌లు, పాస్టర్లే టార్గెట్‌గా కోట్లల్లో డబ్బులు వసూలు చేశారు. రూ.10 వేలు కడితే రూ.10 లక్షలు ఇస్తామంటూ బురిడికొట్టించారు. చైన్ లింక్ తరహాలో లక్షల్లో పెట్టుబడులు పెట్టి పాస్టర్‌లు భారీగా సభ్యులను చేర్చించారు. నమ్మకంతో లక్షల్లో పెట్టుబడులు పెట్టి చర్చ్‌కు వచ్చే వారిని సైతం సభ్యులుగా చేర్చించారు. అనుమానం రాకుండా బాధితులకు బాండ్ పేపర్స్ కూడా ఇచ్చారు. రెండేళ్లుగా నమ్మకంగా ఉంటూ ఇప్పుడు చెప్పాపెట్టకుండా బిచానా ఎత్తేశారు.
స్థలాలు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, చర్చ్‌లు కడతాం, పేదలకు ఇళ్ళు కట్టిస్తాం, పిల్లలకు చదువులు చెప్పిస్తామంటూ కబుర్లు చెప్పారు. దీంతో అమాయకంగా వాళ్ల మాటలు నమ్మిన ప్రజలు చమటోడ్చి కూడబెట్టిన డబ్బును వారికి కట్టారు. ఇలా వేల మంది అమాయక ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చర్చ్‌లే టార్గెట్‌గా ఈ భారీ మోసం జరిగింది. రెండుళ్లుగా నమ్మకంగా ఉన్న ఫౌండేషన్స్ ఇప్పుడు జెండా ఎత్తేసింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లభోదిభోమంటూ రోడ్డెక్కారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.