AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Budget 2022-23: పేదరిక నిర్మూలనలో ఏపీ ఐదో స్థానం.. మంత్రి బుగ్గన వెల్లడి

AP Budget Updates: నీతి ఆయోగ్ ఎస్టీజీ నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలనలో ఏపీ ఐదో స్థానంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. 2022-23 సంవత్సరపు వార్షిక బడ్జెట్ ను;;;

AP Budget 2022-23: పేదరిక నిర్మూలనలో ఏపీ ఐదో స్థానం.. మంత్రి బుగ్గన వెల్లడి
Ap Budget Buggana
Ganesh Mudavath
|

Updated on: Mar 11, 2022 | 10:59 AM

Share

AP Budget Updates: నీతి ఆయోగ్ ఎస్టీజీ నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలనలో ఏపీ ఐదో స్థానంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. 2022-23 సంవత్సరపు వార్షిక బడ్జెట్ ను ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన.. విద్యా, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నాడు-నేడుతో పాటు అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మంచి విద్య, ఆరోగ్యాన్ని అందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. అంతే కాకుండా 99.5 శాతం కాన్పులు స్థానికంగానే జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని వంద శాతం కుటుంబాలకు విద్యుత్ అందుతోందన్నారు మంత్రి.

2022 – 23 ఆర్థిక సంవత్సరానికి గానూ 2,56,257కోట్లు రూపాయలతో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,08,261 కోట్లు, మూలధన వ్యయం అంచనా 47,996 కోట్లు, 2022 – 23 సంవత్సరంలో రెవెన్యూ లోటు 17,036 కోట్లు, ద్రవ్య లోటు 48,724కోట్ల రూపాయలని ప్రతిపాదించారు. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్రి జీఎస్డీపీ లో రెవెన్యూ లోటు 1.27శాతంగా, ద్రవ్య లోటు 3.64 శాతంగా ఉండవచ్చని తెలిపారు. గత మూడు సంవత్సరాలలో ప్రభుత్వం నవరత్నాలు, ఇతర మేనిఫెస్టో పథకాల ద్వారా రాష్ట్రంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. అంతేగాక ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషి, సంస్థాగత బలోపేతం, సామాజిక చేరకల వల్ల అన్ని ఏస్జీజీలలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్ధానం దిశగా పయనిస్తోంది.

అంతకు ముందు వార్షిక బడ్జెట్‌కు సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్‌ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మండలిలో మంత్రి సీదిరి అప్పలరాజు బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కన్నబాబు, మండలిలో వేణుగోపాలకృష్ణ ప్రవేశపెడతారు.

కేబినెట్‌ భేటీకి ముందుఆర్థిక మంత్రి ఛాంబర్‌లో బడ్జెట్‌ ప్రతులకు మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.