AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh BJP: జనవరి 4న రామతీర్థం వెళ్తాం.. భారీ నిరసన కార్యక్రమం చేపడతాం.. ప్రకటించిన సోమువీర్రాజు..

Andhra Pradesh BJP: రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటన ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తుంది. విపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వంపై..

Andhra Pradesh BJP: జనవరి 4న రామతీర్థం వెళ్తాం.. భారీ నిరసన కార్యక్రమం చేపడతాం.. ప్రకటించిన సోమువీర్రాజు..
Shiva Prajapati
|

Updated on: Jan 02, 2021 | 7:24 PM

Share

Andhra Pradesh BJP: రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటన ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తుంది. విపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. తాజాగా రామతీర్థం ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. జనవరి 4వ తేదీన రామతీర్థం వెళుతున్నామని ప్రకటించారు. అంతేకాదు.. అక్కడ భారీ నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన.. రామతీర్థం ఘటనపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ఒక్క రామతీర్థం మాత్రమే కాదని, రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. శ్రీశైలంలో టీడీపీ హయాంలో రబ్బానీ, వైసీపీ హయాంలో రఫీ వ్యవహారం చూశామని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. దేవాలయాలపై దాడుల విషయంలో రాజకీయాలు చేస్తున్నారనడం సరికాదన్నారు. విపక్షాలకు ఆ అవకాశం ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వీర్రాజు పేర్కొన్నారు. ఆలయాలపై దాడులు రాజకీయ అంశం కాదన్నారు. ఆత్మాభిమానం, స్వాభిమానానికి సంబంధించిన అంశం సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తిరుపతి లోక్‌సభ ఎన్నికపైనా సోము వీర్రాజు స్పందించారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. అయితే అభ్యర్థి ఎవరనే విషయంపై తమ రెండు పార్టీలకు స్పష్టత ఉందని అన్నారు.

Also read:

Bharat Biotech’s Covaxin: కోవాగ్జిన్‌కు గ్రీన్ సిగ్నల్..కానీ కండీషన్స్ అప్లై ..భారత్ బయోటెక్‌కు మరిన్ని ప్రశ్నలు

CM Kcr Phone: జహీరాబాద్ రైతుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్.. వ్యవసాయ సాగుపై ఆరా.. ఈసారి స్వయంగా తానే వస్తానంటూ..