CM Kcr Phone: జహీరాబాద్ రైతుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్.. వ్యవసాయ సాగుపై ఆరా.. ఈసారి స్వయంగా తానే వస్తానంటూ..

CM Kcr Phone: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యవసాయంపై మక్కువ ఎక్కువ అనే విషయం తెలిసిందే. స్వయంగా ఆయనే...

CM Kcr Phone: జహీరాబాద్ రైతుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్.. వ్యవసాయ సాగుపై ఆరా.. ఈసారి స్వయంగా తానే వస్తానంటూ..
Follow us

|

Updated on: Jan 02, 2021 | 6:39 PM

CM Kcr Phone: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యవసాయంపై మక్కువ ఎక్కువ అనే విషయం తెలిసిందే. స్వయంగా ఆయనే వ్యవసాయం చేస్తూ పంటలను సాగు చేస్తున్నారు కూడా. అయితే వ్యవసాయంలో నూతన పద్ధతుల గురించి తెలుసుకోవడంపై సీఎం కేసీఆర్‌ అమితాసక్తి కనబరుస్తారు. ఎవరైనా నూతన వ్యవసాయ పద్ధతులతో సాగు చేసినా.. వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధించినా సీఎం కేసీఆర్ స్వయంగా వారికి ఫోన్ చేసిన ఆరా తీసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మొన్నటికి మొన్న ఏపీకి చెందిన ఓ ఆదర్శ రైతుకు ఫోన్ చేసి వ్యవసాయంలో వేద సాగు విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. తాజాగా జహీరాబాద్ మండంలోని రంజోల్ రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఆయన సాగు చేస్తున్న విధానాల గురించి ఆరా తీశారు.

వివరాల్లోకెళితే.. జహీరాబాద్ మండలంలోని రంజోల్ గ్రామానికి చెందిన రైతు నాగిరెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఆలుగడ్డ సాగు, విత్తన రకాల గురించి ఆరా తీశారు. అలాగే ఆ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకువస్తారని, దిగుబడి ఎంత వస్తుందనే అంశాలపై నాగిరెడ్డిని ఆరా తీశారు. త్వరలోనే జహీరాబాద్‌లో పర్యటిస్తానని, ఆయనను కలుస్తానని సీఎం చెప్పారు. ఈ విషయాన్ని రైతు నాగిరెడ్డి వెల్లడించాడు. సీఎంతో ఫోన్ సంభాషణ తాలూకు ఆడియోను మీడియాకు విడుదల చేశాడు. కాగా, సీఎం ఫోన్ చేయడంతో రైతు నాగిరెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

Also read:

అమెరికాలో కోవిడ్ మహమ్మారి ఎక్కడ ? అనేక రాష్ట్రాల్లో నిబంధనలకు పాతర, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో జనాల జాతర

central govt schemes: రైతులూ బీ అలర్ట్.. రూపాయి కట్టకుండా రూ. 36 వేలు పొందవచ్చు.. అదెలాగంటే..!