బీ అలర్ట్.. ఎలాంటి మామిడి తింటున్నారో గమనించండి.. వీటితో వచ్చే సమస్యలు ఇవే..

వేసవికాలం అనగానే మనకు గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు. ఇది సీజనల్ ఫ్రూట్ కావడంతో ప్రతి ఒకరు ఇష్టంగా తింటారు. ప్రతి ఏడాది ఎండాకాలం రాగానే మార్కెట్‎లో మామిడి పండ్ల బండ్లు కనిపించేవి కానీ ఈ సారి సీజన్‎కి ముందే కనిపిస్తున్నాయి. ప్రతి ఏడాది కంటే నెలన్నర ముందే మార్కెట్‎లో మామిడి సందడి చేస్తుంది. ఏ పండ్ల మార్కెట్ చూసిన పండ్ల రాజైన మామిడి దర్శనమిస్తున్నాయి. వీటిలో చాలా వరకు పక్వానికి రాని పండ్లను మార్కెట్‎లకు తీసుకొచ్చి మందులతో మాగాపెడుతున్నారు వ్యాపారులు.

బీ అలర్ట్.. ఎలాంటి మామిడి తింటున్నారో గమనించండి.. వీటితో వచ్చే సమస్యలు ఇవే..
పచ్చి మామిడి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్ర పోషించే ఫైబర్ కూడా ఇందులో అధికంగా ఉంటుంది. అయితే మామిడికాయలను పచ్చిగా ఉన్నప్పుడు తింటే కాస్త పుల్లగా ఉంటాయి. ఇది అనేక జీర్ణ ఎంజైమ్‌లను కూడా కలిగి ఉంటుంది.
Follow us

| Edited By: Srikar T

Updated on: May 05, 2024 | 5:43 PM

వేసవికాలం అనగానే మనకు గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు. ఇది సీజనల్ ఫ్రూట్ కావడంతో ప్రతి ఒకరు ఇష్టంగా తింటారు. ప్రతి ఏడాది ఎండాకాలం రాగానే మార్కెట్‎లో మామిడి పండ్ల బండ్లు కనిపించేవి కానీ ఈ సారి సీజన్‎కి ముందే కనిపిస్తున్నాయి. ప్రతి ఏడాది కంటే నెలన్నర ముందే మార్కెట్‎లో మామిడి సందడి చేస్తుంది. ఏ పండ్ల మార్కెట్ చూసిన పండ్ల రాజైన మామిడి దర్శనమిస్తున్నాయి. వీటిలో చాలా వరకు పక్వానికి రాని పండ్లను మార్కెట్‎లకు తీసుకొచ్చి మందులతో మాగాపెడుతున్నారు వ్యాపారులు. ఇప్పటికే ఇలాంటి కెమికల్స్‎ని వాడొద్దని అధికారులు నిషేదించినప్పటికీ, వ్యాపారాలు మాత్రం విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇది తెలియక మామిడి పండ్లను ఖరీదు చేసి తింటున్నారు జనం.

కార్బైన్డ్‎తో మాగపెట్టిన వాటిని తింటే ఆరోగ్యానికి హానిచేయడంతో పాటు లేనిపోని రోగాలు వస్తాయని అంటున్నారు వైద్య నిపుణులు. శరీరానికి అక్కరికొచ్చే పోషకాలు మామిడిలో చాలా ఉంటాయి. చిన్న సైజ్ మామిడి పండు 150 కిలో కేలరీల శక్తిని ఇవ్వడంతో పాటు విటమిన్ సీ, ఏ, బీ 12 , బీ కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఒమేగా 3, ఒమేగా 6, మినరల్స్, ఫైబర్, కార్బోహైడ్రాట్స్, సోడియం, షుగర్‎తో పాటు మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ మామిడిలో అధికంగా ఉంటాయని అంటున్నారు డాక్టర్స్. కానీ అలాంటి సహజసిద్ధంగా పండించిన ఫ్రూట్స్ మార్కెట్‎లో దొరకడం లేదని చెబుతున్నారు.

వివిధ కెమికల్స్‎తో పండించిన మామిడి పండ్లును తింటే డేంజర్ అని చెబుతున్నారు. వీటి కారణంగా ఊబకాయం, గ్యాస్ట్రిక్, చర్మ వ్యాధులు, లివర్ సమస్యలతో పాటు పేగులో క్యాన్సర్, కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయని అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్దులు వీటికి దూరంగా ఉండాలని, తినే ముందు ఒకటికి రెండు సార్లు కడుకొని తినాలని సూచిస్తున్నారు. మే నెలను మామిడి పండ్ల సీజన్ గా పిలుస్తారు, కానీ వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఈ ఏడాది తొందరగా పండ్లు మార్కెట్‎కి వచ్చాయని అంటున్నారు వ్యాపారులు. ఎలాంటి రసాయనాలను లేకుండా పండ్లను అమ్ముతున్నామని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. మరి కొందరు, హోల్ సేల్ మర్కెట్స్‎లో దొరికే వాటిని తెచ్చుకొని రోడ్‎లపై అముతున్నాము తప్ప వీటిని ఎలా పండిచారో తెలియదని అంటున్నారు. సీజన్ ఫ్రూట్ కావడంతో కేజీ రూ.150 వరుకు ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..