అమెరికాలో కోవిడ్ మహమ్మారి ఎక్కడ ? అనేక రాష్ట్రాల్లో నిబంధనలకు పాతర, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో జనాల జాతర

అమెరికాలో ఓ వైపు కోవిడ్ 19 విజృంభిస్తుండగా మరోవైపు దాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా లక్షలాది ప్రజలు ఆర్భాటంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకొన్నారు.

అమెరికాలో కోవిడ్ మహమ్మారి ఎక్కడ ? అనేక రాష్ట్రాల్లో  నిబంధనలకు పాతర,  న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో జనాల జాతర
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 02, 2021 | 9:37 PM

అమెరికాలో ఓ వైపు కోవిడ్ 19 విజృంభిస్తుండగా మరోవైపు దాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా లక్షలాది ప్రజలు ఆర్భాటంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకొన్నారు. న్యూయార్క్, లాస్ వెగాస్ , మియామీ బీచ్, మన్ హాటన్ బ్రూక్లిన్ వంటి అనేక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో చేరిన వీరంతా అసలు తమ దేశంలో కరోనా వైరస్ లేనట్టుగా విందులు, వినోదాల్లో మునిగి తేలారు. మియామీ బీచ్ లోని రెస్టారెంట్లు, బార్లు, షాపులు ప్రజలతో క్రిక్కిరిసిపోయాయి. మాస్కుల ధారణ, గానీ, భౌతిక దూరం పాటింపు వంటి నిబంధనలను గానీ ఎవరూ ఖాతరు చేయలేదు. పోలీసులు, రాజకీయ నాయకులూ, ఆరోగ్య నిపుణులు చేసిన హెచ్ఛరికలను ఎవ్వరూ పట్టించుకోలేదు. కొంతమంది రంగుల కాస్ట్యూమ్స్ ధరించి సెల్ఫీలు తీసుకోవడం విశేషం. శుక్రవారం దేశంలో 20 మిలియన్ కరోవా వైరస్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 3,927 మంది రోగులు మృత్యుబాట పట్టారు. ఇప్పటివరకు 3 లక్షల 46 వేల మంది మరణించారు. రాబోయే రోజుల్లో మరింత ముప్పు తప్పదని నిపుణులు  వార్ణింగ్ ఇస్తున్నారు.కానీ అది అరణ్య రోదనే అవుతోంది.

అటు బ్రిటన్ లో కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్న క్వీన్స్ మేరీ ఆసుపత్రివద్ద పెద్ద సంఖ్యలో చేరిన ప్రజలు కోవిద్ ఓ హోక్స్  (ఓ బూటకం) అంటూ నినాదాలు చేశారు. అసలు ఇది వ్యాధే కాదన్నట్టు అనేకమంది వ్యాఖ్యానించారు.