AP 10th Exams 2023: ఏపీ పదో తరగతి ప్రశ్నపత్రాలపై సీరియల్‌ నంబర్ల ముద్రణ.. లీకేజీలకు చెక్‌ పెట్టేందుకే..

|

Mar 15, 2023 | 8:42 PM

దేశ వ్యప్తంగా పలు రాష్ట్రాల్లో లీకుల కేసులు ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. పైగా గతేడాది లీకేజీ ఘటనలు గట్టిపాఠాలే నేర్పాయి. ఈ నేపథ్యంలో ఏపీ పదో తరగతి ప్రశ్నపత్రాలు లీకుకాకుండా ఉండేందుకు కొన్ని కీలక మార్పులు చేస్తున్నారు..

AP 10th Exams 2023: ఏపీ పదో తరగతి ప్రశ్నపత్రాలపై సీరియల్‌ నంబర్ల ముద్రణ.. లీకేజీలకు చెక్‌ పెట్టేందుకే..
Andhra Pradesh
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పరీక్షల హాల్‌ టికెట్లు కూడా విడుదలయ్యాయి. ఈసారి దాదాపు 3,350 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా తాజాగా తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దేశ వ్యప్తంగా పలు రాష్ట్రాల్లో లీకుల కేసులు ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. పైగా గతేడాది లీకేజీ ఘటనలు గట్టిపాఠాలే నేర్పాయి. ఈ నేపథ్యంలో ఏపీ పదో తరగతి ప్రశ్నపత్రాలు లీకుకాకుండా ఉండేందుకు కొన్ని కీలక మార్పులు చేస్తున్నారు. ప్రశ్నాపత్రాలపై సీరియల్‌ నంబర్లను ఏర్పాటు చేసి, లీకేజీలకు చెక్‌ పెట్టేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

ఎక్కడైనా ప్రశ్నాపత్రాలు లీకైతే వెంటనే గుర్తించేందుకు వీలుగా ఈ ఏడాది అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రాలపై సీరియల్‌ నంబర్లను ముద్రించనున్నారు. జిల్లాల వారీగా పంపించే ప్రశ్నపత్రాల అంకెలను నమోదు చేస్తున్నారు. అక్కడి నుంచి ఏయే కేంద్రాలకు ఏ అంకెలున్నవి సరఫరా చేస్తారో వాటిని నమోదు చేసుకుంటారు. ఎక్కడైనా ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లు తెలిస్తే.. వెంటనే ఏ కేంద్రం నుంచి బయటకు వచ్చిందో గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.