Andhra Pradesh: ఆ జిల్లాకు ANR పేరు పెట్టండి.. ఏపీ సర్కారుకు అక్కినేని అభిమానులు వినతి
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఓ వైపు శరవేగంగా సాగుతుంది. జిల్లాల ఏర్పటుకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో 13 జిల్లాలు ఇప్పుడు సరికొత్త రూపాన్ని..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఓ వైపు శరవేగంగా సాగుతుంది. జిల్లాల ఏర్పటుకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో 13 జిల్లాలు ఇప్పుడు సరికొత్త రూపాన్ని సంతరించుకుటూ 26 జిల్లాలుగా మారనున్నాయి. మరోవైపు కొత్త జిల్లాల(New Districts) ఏర్పాటు పై వివాదాలు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల ఏర్పాటుపై పలు డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. జిల్లాల పునర్విభజనతో పాటు జిల్లాల పేర్ల విషయంలొనూ అభ్యంతరాలు వినిపిస్తున్నాయి. అనూహ్యంగా టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పేరు తెరమీదకు వచ్పెచింది. మా జిల్లాకు ఏఎన్నార్ పేరు పెట్టమని ఏపీ సర్కారుకు అక్కినేని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడనున్న కొత్త జిల్లా మచలీపట్నం(Machalipatnam). అయితే ఈ జిల్లాకు దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) పేరు పెట్టాలని అక్కినేని అభిమానులు అభ్యర్ధన చేస్తున్నారు. ఏపీ సర్కార్ తమ కోరికను దృష్టిలో పెట్టుకోవాలని ఆలిండియా అక్కినేని అభిమాన సంఘం అధ్యక్షుడు సర్వేశ్వరరావు కోరుతున్నారు. గుడివాడ రామపురంలో జన్మించిన అక్కినేని నాగేశ్వరరావు విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు ప్రయాణం అతి సుదీర్ఘకాలం.. అయన సినీ రంగంలో చేసిన సేవకు దాదాఫాల్కే అవార్డు వంటి అనేక అవార్డులు అందుకున్నారు. విద్యా, సామాజిక సేవల్లోను ఎంతో తోడ్పాటు అందించారు అంటూ ఏఎన్నార్ ను గుర్తు చేశారు. అంతేకాదు ఏఎన్నార్ ఎక్కడో మద్రాస్ లో ఉన్న సినీ ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చారు..తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన మహావ్యక్తి అని సర్వేశ్వరరావు చెప్పారు. ఏఎన్నార్ కళారంగానికి చేసిన సేవలకు గాను ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.