Nellore Politics: ఏపీలోని నెల్లూరులో రాజకీయాలు మరింత హీటెక్కాయి.. ఓవైపు టీడీపీ యువగళం పాదయాత్రలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు, ఆనంరాంనారాయణరెడ్డి సవాల్.. అంతేధీటుగా వీరిద్దరికీ కౌంటర్ ఇస్తూ మాజీమంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఫైర్.. ఇలా నెల్లూరు పాలిటిక్స్ గరంగరంగా మారాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరోసారి ఆనంరాంనారాయణ రెడ్డికి సవాల్ చేశారు. ఆనం రాంనారాయణ రెడ్డి తనపై పోటీ చేసి గెలవాలంటూ అనిల్ కుమార్ పేర్కొన్నారు.
2024లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలి.. ఓడిపోతే 44 ఏళ్లకే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అంటూ అనిల్ యాదవ్ సవాల్ చేశారు. దమ్ముంటే టీడీపీ నుంచి టిక్కెట్ తెచ్చుకోవాలని ఛాలెంజ్ కూడా చేశారు.. నెల్లూరులో ఎక్కడ నుంచైనా పోటీ చేసే సత్తా ఉందంటున్నావు.. నీది పెద్ద కుటుంబం, బచ్చా గాడి మీద పోటీ చేసి గెలువు అంటూ ఫైర్ అయ్యారు.
ఆనం ఎక్కడా పోటీ చేసినా గెలవరని.. టీడీపీని సైతం వదిలేస్తారని పేర్కొన్నారు. జిల్లాలో వైసీపీలో కలుపు మొక్కలుగా ఉన్న ముగ్గురిని పీకి పారేసారని.. వచ్చే ఎన్నికల్లో పది స్థానాల్లోనూ వైసీపీ గెలుస్తుందని తెలిపారు.
తాను నెల్లూరు నుంచే పోటీ చేస్తానని.. ఆనం రాంనారాయణ రెడ్డి పేర్కొన్నారు. తాను నెల్లూరు నుంచి గెలిచే ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వచ్చానని.. టీడీపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..