Anganwadi Workers Protest : 27వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె.. విధుల్లో చేరేందుకు నేడు ప్రభుత్వ డెడ్‌లైన్‌..!

|

Jan 08, 2024 | 7:29 AM

తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్ వాడీ వర్కర్లు ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎస్మా చట్టంపై అంగన్‌వాడీ కార్యకర్తలు ఏమాత్రం వెనక్కితగ్గలేదు. 27వ రోజు సమ్మెను కంటిన్యూ చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గబోమంటూ హెచ్చరిస్తున్నారు. నరసరావుపేటలో రాత్రిపూట కూడా సమ్మె కొనసాగించారు.

Anganwadi Workers Protest : 27వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె.. విధుల్లో చేరేందుకు నేడు ప్రభుత్వ డెడ్‌లైన్‌..!
Ap Anganwadi Workers
Follow us on

ఎస్మాతో సమ్మెచేయడానికి వీల్లేందంటూ ప్రభుత్వం ఉక్కుపాదం మోపినప్పటికి… ఏపీలో అంగన్‌వాడీ నిరసన కంటిన్యూ చేస్తున్నారు. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నం.2ను జారీ చేసి.. ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలకు ఆస్కారం లేదంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్ వాడీ వర్కర్లు ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎస్మా చట్టంపై అంగన్‌వాడీ కార్యకర్తలు ఏమాత్రం వెనక్కితగ్గలేదు. 27వ రోజు సమ్మెను కంటిన్యూ చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గబోమంటూ హెచ్చరిస్తున్నారు. నరసరావుపేటలో రాత్రిపూట కూడా సమ్మె కొనసాగించారు.

మరోవైపు విజయవాడలో అంగన్‌వాడీ కార్యకర్తలు కంటిన్యూ చేస్తున్న సమ్మెకు సీపీఎం నేతలు మద్దతు తెలిపారు. ఎస్మాపై ప్రభుత్వానికి సీపీఎం డెడ్‌లైన్‌ విధించింది. సంక్రాంతిలోగా ఎస్మాను ఎత్తివేయాలి..అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలన్నారు సీపీఎం నేత బీవీ రాఘవులు. అంగన్‌వాడీల సమ్మె ప్రజల ఉద్యమంగా మారిందన్నారు. ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే సహించేదిలేదన్నారు రాఘవులు.

అంగన్‌వాడీల సమ్మెతో గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలు ఇబ్బందులు పడుతున్నారంటూ ఎస్మాను ప్రయోగించింది ప్రభుత్వం. ఎస్మా ప్రయోగం తర్వాత కూడా అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మె కొనసాగిస్తూ.. విధులకు హాజరుకాకపోవడంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది.. ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..