AP Mptc Zptc Elections Result: ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైఎస్సార్ జిల్లాలో బోణి కొట్టిన వైసీపీ
AP Mptc Zptc Elections Result: ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 206 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో అధికార
AP Mptc Zptc Elections Result: ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 206 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో అధికార వైసీపీ ఎంపీటీసీ ఫలితంలో మొదట బోణి కొట్టింది. వైయస్సార్ జిల్లా కమలాపురం మండలం దేవరాజుపల్లెలో వైసీపీ మొదటి విజయం సాధించింది. ఎంపిటీసీ 221 ఓట్లు పోలయ్యాయి. వాటిలో ఇన్ వాలిడ్ 17, టీడీపీ – 5, వైసీపీ – 191 కి వచ్చాయి. 186 ఓట్లమెజారిటీతో వైసీపీ అభ్యర్థి చెన్నకేశవ రెడ్డి గెలుపొందారు.
రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో కౌంటింగ్ కోసం అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కాగా.. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. నిబంధనలు కఠినంగా అమలవుతాయని… ఫలితాల అనంతరం విజయోత్సవాలు, ర్యాలీలపై పూర్తిగా నిషేధం విధించినట్లు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టంచేశారు.
ఎంపీటీసీ: మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలున్నాయి. నోటిఫికేషన్ జారీ సమయంలో.. 375 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మొత్తం 9672 స్ధానాల్లో.. 2,371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. సుదీర్ఘ ప్రక్రియలో అభ్యర్ధుల మృతితో 81 స్థానాల్లో పోలింగ్ నిలిచిపోయింది. 7220 స్ధానాలకు ఎన్నికలు జరగగా.. 18,782 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.
జడ్పీటీసీ: ఏపీలో మొత్తం జడ్‌పీటీసీ స్థానాలు 660 ఉండగా.. 8 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. 652 స్ధానాల్లో.. 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 515 స్ధానాలకు పోలింగ్ జరగగా.. 2058 అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. మధ్యాహ్నం కల్లా ఎంపీటీసీ ఫలితాలు వెలువడే అవకాశముంది. రాత్రి నాటికి జిల్లా పరిషత్ ఫలితాలు వెలువడుతాయని అధికారులు పేర్కొన్నారు.